Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు కు ఆ ఛాన్స్ ఉంటే ముందు జగన్ కేసు ల సంగతే చూస్తారుగా?!

చంద్రబాబు కు ఆ ఛాన్స్ ఉంటే ముందు జగన్ కేసు ల సంగతే చూస్తారుగా?!
X

లాజిక్ లేని సజ్జల వ్యాఖ్యలు

‘టీడీపీ, చంద్రబాబు లైన్‌కు అనుగుణంగా సీబీఐలో కింది స్థాయి అధికారులు పనిచేస్తున్నారు. నిష్పక్షపాతంగా వారు పనిచేయకపోగా, కల్పిత వాంగ్మూలాలను సృష్టించి , సీఎం జగన్‌ పై వ్యక్తిత్వహననానికి పాల్పడుతున్నారు. సీబీఐ ప్రకటనల వెనుక రాజకీయ ప్రమేయముంది.’ ఇదీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి చేసిన ప్రకటన. సాక్షి పత్రిక కూడా చంద్రబాబు బీజేపీ లో ఉన్న తన కోవర్టుల ద్వారా కేసు ను చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారు అని రాశారు. ఇది అంతా ఎందుకు అంటే వై ఎస్ వివేకా హత్యకు సంబంధించి ఎంపీ వై ఎస్ అవినాష్ రెడ్డి పై వస్తున్న ఆరోపణలపై అటు సజ్జల, ఇటు సాక్షి స్పందన ఇది. సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పినట్లు కేంద్రం అధీనంలో ఉన్న సిబిఐ లో అయినా...ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అధీనంలో ఉన్న సిఐడీ వంటి సంస్థలో అయినా ప్రభుత్వ పెద్దలు, పై అధికారుల ఆదేశాలు లేకుండా..కింద స్థాయి అధికారులు సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా....అదే జరిగే పనేనా....ఎంతో కాలం జర్నలిస్ట్ గా, ఇప్పుడు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సజ్జల కు ఈ విషయం తెలియదా అని ఒక కీలక వైసీపీ నాయకుడు వ్యాఖ్యానించటం విశేషం.

అటు సాక్షి...ఇటు సజ్జల వ్యాఖ్యలపై ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి సంచలన కామెంట్స్ చేశారు అని చెప్పొచ్చు. అటు సజ్జల, ఇటు సాక్షి చెపుతున్నట్లు నిజంగా చంద్రబాబు కు అలాంటి అవకాశమే ఉంటే ముందు సీఎం జగన్ పై ఉన్న కేసు ల విషయంలోనే వాళ్ళు చెప్పిన కోవర్టులతో పని చేయించుకునే వాళ్ళుగా అని లాజిక్ తో కొట్టారు. చంద్రబాబు కు వచ్చే ఎన్నికల్లో ఈజీ గా గెలవాలంటే ముందు ఏ మాత్రం అవకాశం ఉన్నా తొలుత జగన్ కేసు ల సంగతి చూసుకుంటారు కానీ...రాజకీయంగా కడప జిల్లాలో తప్ప బయట పెద్దగా ప్రభావం చూపించలేని వై ఎస్ అవినాష్ రెడ్డి ని టార్గెట్ చేయటం వల్ల చంద్రబాబు కు లాభం ఏమి ఉంటది అని అయన ప్రశ్నించారు. నిజంగా చంద్రబాబు ఇప్పుడు సిబిఐ ని ప్రభావితం చేసే ఛాన్స్ ఉంటే నేరుగా జగన్ కేసు ల విషయం చూసుకుంటారు కానీ...ఈ కేసు ఎందుకు చూస్తారు అని అయన సందేహం లేవనెత్తారు. దీంతో వైసీపీ నేతల వాదనలో ఏ మాత్రం లాజిక్ లేదు అనే అభిప్రాయం సొంత పార్టీ నేతల్లోనే వ్యక్తం అవుతోంది. మరో వైపు కేంద్ర పెద్దల అండదండలు ఉన్నందునే సీఎం జగన్ కేసు లు ఏ మాత్రం ముందుకు సాగటం లేదు అనే విమర్శలు ఉన్న విషయం తెలిసిందే.



Next Story
Share it