Telugu Gateway
Andhra Pradesh

అలా జగన్ ను కలిశారు..ఇలా రెండు సినిమాలు ప్రకటించారు.

అలా జగన్ ను కలిశారు..ఇలా రెండు సినిమాలు ప్రకటించారు.
X

దర్శకుడు రాంగోపాల్ వర్మ అసలు ఏమి దాచుకోరు. కాకపోతే చెప్పటం కాస్త ఆలశ్యం అవుంతుందోమో కానీ చెప్పటం మాత్రం పక్కా.నిన్న సీఎం జగన్ తో భేటీ అయ్యారు..ఇవ్వాళ రెండు సినిమాలు అనౌన్స్ చేశారు. ఈ మేరకు అయన వరస ట్వీట్స్ చేశారు. అందులోనే తాను రెండు రాజకీయ సినిమాలు తీయబోతున్నట్లు ప్రకటించారు. వాటి పేర్లు కూడా చెప్పేశారు. వర్మ ట్వీట్స్ ఇలా ఉన్నాయి. ' ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక ,ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనక చెప్పట్లేదు.రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం "వ్యూహం " షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 "శపథం " లో తగులుతుంది .వ్యూహం " చిత్ర నిర్మాత నాతో అంతకు ముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్ .ఈ చిత్రం 2 పార్ట్స్ గా రాబోతుంది .. మొదటి పార్ట్ "వ్యూహం" ,2nd పార్ట్ "శపథం" .. రెండింటిలోనూ రాజకీయ ఆరాచకీయాలు పుష్కలంగా వుంటాయి.

అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన "వ్యూహం" కధ , రాజకీయ కుట్రల విషం తో నిండి వుంటుంది .రాచకురుపు పైన వేసిన కారం తో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే "వ్యూహం" చిత్రం.' అంటూ రాశారు. ఇది బయోపిక్ కాదు …బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్.బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి అన్నారు. దీంతో ఇందులో రామ్ గోపాల్ వర్మ ఎవరిని టార్గెట్ చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. సహజంగా ఉంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు, తర్వాత పవన్ కళ్యాణ్ ఉంటారు అన్న విషయం తెలిసిందే. మరి వర్మ సినిమాలు రాజకీయంగా వైసీపీ కి ఎంత వరకు మేలు చేస్తాయనేది వేచిచూడాల్సిందే.

Next Story
Share it