పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయండి
ఏపీలో ఇంటర్, పదవ తరగతి పరీక్షల నిర్వహణ అంశంపై శుక్రవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద ఎత్తున పెరుగుతున్నందున పరీక్షలు వాయిదా వేసేలా ఆదేశించాలని కోరుతూ కోర్టులో పలు పిటీషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటీషన్ల విచారణ సందర్భంగా హైకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న ఈ తరుణంలో లక్షలాది విద్యార్ధులకు పరీక్షలు ఎలా పెడతారని ప్రశ్నించింది.
అదే సమయంలో పక్క రాష్ట్రాల్లో కూడా పరీక్షలను వాయిదా వేసినందున..ప్రభుత్వం తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మే3వ తేదీకి వాయిదా వేసింది. కరోనా వచ్చిన విద్యార్ధులు తీవ్ర ఒత్తిడితో ఉంటారని..వారు పరీక్షలు ఎలా రాయగలుగుతారని సందేహం వ్యక్తం చేసింది. కరోనా సోకిన వారికి విడిగా పరీక్షలు పెడతామని తెలపగా..వారు ఐసోలేషన్ లో ఉండాలి కానీ.. పరీక్షలు ఎలా రాయగలుగుతారని హైకోర్టు ప్రశ్నించింది. మే 5 నుంచి ఇంటర్ పరీక్షల నిర్వహణకు సర్కారు రెడీ అయింది.