Telugu Gateway
Andhra Pradesh

కొడాలి నానిపై కేసు నమోదుకు ఎస్ఈసీ ఆదేశం

కొడాలి నానిపై కేసు నమోదుకు ఎస్ఈసీ ఆదేశం
X

ఏపీ మంత్రి కొడాలి నాని, ఎస్ఈసీ నిమ్మగడ్డల రమేష్ కుమార్ ల వివాదం కొత్త మలుపు తిరిగింది. మంత్రిపై కేసు నమోదు చేయాల్సిందిగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం నాడు కృష్నా జిల్లా (రూరల్) ఎస్పీని ఆదేశించారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినందుకు ఐపీసీ 504, 505(1)(C), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఆదేశాల్లో ఎస్‌ఈసీ పేర్కొంది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినందుకు క్లాజ్‌-1, క్లాజ్‌-4 కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌పై, కమిషనర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

కొడాలి నాని శుక్రవారం ఉదయం తాడేపల్లిలో విలేకరుల సమావేశం పెట్టి నిమ్మగడ్డపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలపై స్పందించిన ఎస్‌ఈసీ.. ఆయనకు షోకాజ్‌ నోటీసు పంపించింది. సాయంత్రానికి మంత్రి తన వివరణను న్యాయవాది ద్వారా పంపించారు. తర్వాత కూడా మరోసారి మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఎస్ఈసీపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

Next Story
Share it