Telugu Gateway
Andhra Pradesh

వర్మ వ్యూహం టీజర్ పై వివాదం!

వర్మ వ్యూహం టీజర్ పై  వివాదం!
X

రాజకీయ సినిమాలు తెలుగు ప్రేక్షుకులకు కొత్తేమి కాదు. ఇది ఎప్పటినుంచో ఉన్న వ్యవహారమే. అయితే ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీ పై విమర్శలు చేయటానికి సినిమాను ఒక అస్త్రంగా వాడుకుంటారు. కానీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైసీపీనే దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఎన్నికల కోసమే రెండు సినిమా లు తీయించుకుంటోంది. సీఎం జగన్ తో వర్మ పలు మార్లు భేటీ అయి కూడా ఈ విషయాలు చర్చించారు. ఈ రాజకీయ సినిమాల్లో వ్యూహం ఒకటి . ఈ సినిమా రెండవ టీజర్ మంగళవారం నాడు విడుదల అయింది. ఇందులో జగన్ పాత్రధారి చాలా ఆశ్చర్యంగా రాష్ట్ర విభజనా(Bifurcationa) అని ప్రశ్నిస్తే.. ఆ సమయంలో సోనియా పాత్రధారి చాలా సీరియస్ గా చపాతీ ని రెండు ముక్కలు చేస్తున్నట్లు చూపించారు వర్మ. రాష్ట్ర విభజన అంశాన్ని వర్మ చపాతీ ని రెండు ముక్కలు చేసినట్లు చూపించటం దుమారం రేపటం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ను గౌరవించి, తెలంగాణ ఉద్యమాన్ని గమనంలోకి తీసుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అలాంటి సెంటిమెంట్ తో కూడిన విషయాన్నీ వర్మ వైసీపీ అధినేత, సీఎం జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం నిర్మిస్తున్న సినిమాలో చపాతీని రెండు ముక్కలు చేసినట్లు చూపించటం చర్చనీయాంశగా మారింది.

రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంతో ఈ టీజర్ స్టార్ట్ అవుతుంది. ఆ వెంటనే చంద్రబాబు ను చూపిస్తూ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఈ ప్రమాదాన్ని ఇంటర్ లింక్ చేసే ప్రయత్నం చేశారు వర్మ. నిజం షూ లేస్ కట్టుకునే లోపే అబద్దం ప్రపంచం అంత ఓకే రౌండ్ వేసివస్తుంది అంటూ జగన్ డైలాగు ఉండి ఇందులో. ఎప్పుడో ఒకప్పుడు మీరు కళ్యాణ్ ను కూడా వెన్నుపోటు పొడుస్తారు కదా అని ఒకరు చంద్రబాబుతో అంటుంటే..చంద్రబాబు వాడికి అంత సీన్ లేదు ...తనను తానే పొడుచుకుంటాడు అంటూ చంద్రబాబు డైలాగులు ఉన్నాయి. ఇందులో చిరంజీవి, పవన్ కళ్యాణ్ పాత్రధారులను కూడా చూపించారు. అటు వైఎస్ఆర్ మరణం అయినా..రాష్ట్ర విభజన అయినా..సీఎం జగన్ పై సిబిఐ కేసు లు అన్ని ప్రజలకు బాగా తెలిసిన అంశాలు. మరి నిజం పేరుతో ఛానల్ నడిపే వర్మ ఇందులో ఎన్ని నిజాలు చూపిస్తారో సినిమా విడుదల అయితే కానీ తెలియదు. రాష్ట్ర విభజనను వర్మ తన సినిమాలో అవమానించేలా చూపిన అధికార బిఆర్ఎస్ స్పందిస్తుందో లేదో చూడాలి. ఇప్పుడు పార్టీ పేరులో నుంచే తెలంగాణ తీసేసిన వాళ్ళు వర్మ చపాతీ ముక్కలపై పట్టించుకుంటరా ..లేక సీఎం కెసిఆర్ మిత్రుడు సీఎం జగన్ కోసం చూసి చూడనట్లు వదిలేస్తారా అన్నది చూడాల్సి ఉంది.

Next Story
Share it