Telugu Gateway
Andhra Pradesh

చంద్ర‌బాబుకు ర‌జ‌నీకాంత్ ఫోన్

చంద్ర‌బాబుకు ర‌జ‌నీకాంత్ ఫోన్
X

ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకున్న ప‌రిణామాల‌పై ప్ర‌ముఖ న‌టుడు, సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ విచారం వ్య‌క్తం చేశారు. తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడి భార్య భువ‌నేశ్వ‌రిపై వైసీపీ స‌భ్యులు అభ్యంత‌క‌ర వ్యాఖ్య‌లు చేశారంటూ చంద్ర‌బాబు మీడియా స‌మావేశంలో విల‌పించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యం మీడియా ద్వారా తెలుసుకున్న ర‌జ‌నీకాంత్ చంద్ర‌బాబుకు ఫోన్ చేసి ప‌రామ‌ర్శించారు. అసెంబ్లీలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ను అడిగి తెలుసుకున్నారు.

అన్నాడీఎంకే పార్టీ సీనియర్‌ నేత మైత్రేయన్‌ కూడా చంద్రబాబుకు ఫోన్‌ చేసి మాట్లాడారు. త‌న‌కు 1984 నుంచి ఎన్టీఆర్‌ కుటుంబంతో పరిచయాలు ఉన్నాయ‌ని తెలిపారు.. ఎన్టీఆర్‌ కుమార్తె భువనేశ్వరిపై అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు చేశారని విని బాధపడ్డాను. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. చంద్రబాబుకు ఫోన్‌ చేసి మాట్లాడాను అని మైత్రేయన్‌ ట్వీట్‌ చేశారు. శ‌నివారం నాడు ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యులు కూడా మీడియా ముందుకు వ‌చ్చి ఇదే అంశంపై మాట్లాడిన విష‌యం తెలిసిందే.

Next Story
Share it