వైసీపీకి ఎవరితోనూ పొత్తు ఉండదు
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే పేరుగాంచిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం వైసీపీకి పనిచేయటంలేదన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేశారని..భవిష్యత్ లోనూ వైసీపీ కోసం ఆయన పనిచేయకపోవచ్చని వ్యాఖ్యానించారు ప్రశాంత్ కిశోర్‌తో సీఎం వైఎస్ జగన్‌కి వ్యక్తిగత సాన్నిహిత్యం ఉందన్నారు. భవిష్యత్‌లో పీకె తమ కోసం పనిచేసే అవకాశాలు ఉండకపోవచ్చు అని పేర్కొన్నారు.
తమకు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ పార్టీతోనూ వైసీపీకి పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీచేయాలన్నది సీఎం వైఎస్ జగన్ సిద్ధాంతం అని తెలిపారు. బలంగా ఉన్నందున తమతో పొత్తు పెట్టుకోవాలని చాలా పార్టీలు అనుకోవచ్చని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ఎప్పుడూ పొత్తుల్లేకుండానే రాజకీయం చేస్తున్నారని తెలిపారు.