Telugu Gateway
Andhra Pradesh

ఇదో కొత్త తరహా క్విడ్ ప్రో కో !

ఇదో కొత్త తరహా క్విడ్ ప్రో కో !
X

చేతిలో నుంచి రూపాయి పెట్టకుండా వందల కోట్ల రూపాయలు సంపాదించటం ఎలాగో ఆ పవర్ బ్రోకర్ కు తెలిసినంతగా మరెవరికి తెలియదు ఏమో. ఆంధ్ర ప్రదేశ్ లోని ఇద్దరు కీలక నేతల అండతో అయన రెచ్చిపోతున్న తీరు ఇప్పుడు అధికార, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గోల్ మాల్ వ్యవహారాలు చేయటంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు ఆయన. మొదటి నుంచి మోసాలు చేసే స్కూల్ లో మాస్టర్స్ చేసిన ఆయన ఇప్పుడు అధికారం...కీలక నేతల అండతో అడ్డూ అదుపులేకుండా రెచ్చిపోతున్నారు. ఈ పవర్ బ్రోకర్ కు చెందిన వ్యవహారం కొత్తది మరొకటి వెలుగులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా ఆయన ఆంధ్ర ప్రదేశ్ లో జెన్ కో అనంతపురం జిల్లా యాడికిలో తలపెట్టిన పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ (పీఎస్ పీ) కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తాము అనుకున్న విధంగా ఈ ప్రాజెక్ట్ బినామీ కంపెనీకి దక్కేలా అంతా సెట్ చేసుకున్నారు.. అయితే పోటీ లో నిలిచింది కూడా ముందు నుంచి ఈ ప్రాజెక్ట్ పై కన్నేసిన మరో మెగా కంపెనీ కావటంతో ఈ వ్యవహారం అంత సాఫీగా సాగలేదు. అందుకే ఏకంగా ఈ టెండర్ గడువులు అలా పొడిగించుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.

అయితే ఇప్పుడు మధ్యే మార్గంగా ఆ పవర్ బ్రోకర్ ఒక కొత్త ప్లాన్ తెరమీదకు తెచ్చినట్లు విద్యుత్ శాఖ వర్గాలు తెలిపాయి. అదేంటి అంటే ఐదు వేల కోట్ల రూపాయల ఈ జెన్ కో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్న ప్రకారం లింగా తెరమీదకు తెచ్చిన బినామీ కంపెనీకి దక్కుతుంది. కానీ పనులు మాత్రం ఎవరైతే డీపీఆర్ తో పాటు ఇతర ఏర్పాట్లు చేసుకున్నారో వాళ్లకు కేటాయించటానికి ఒప్పందం సిద్ధం అయినట్లు విద్యుత్ శాఖ వర్గాలు వెల్లడించాయి. మరో వైపు ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఏకంగా 20 శాతం మేర పెంచినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఈ జెన్ కో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ తీసుకుని దీని కోసం పోటీ పడుతున్న సంస్థకే పనులు ఇచ్చేసి...అందుకు ప్రతిగా ఆంధ్ర ప్రదేశ్ లో శరవేగంగా ప్రగతి పధంలో దూసుకెళుతున్న నగరంలో ఒక కీలక హాస్పిటల్ ను సొంతం చేసుకునేందుకు లింగా స్కెచ్ వేసినట్లు విద్యుత్ శాఖ వర్గాలు చెపుతున్నాయి. అయితే ఇందులో ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వాళ్లకు కూడా ఎవరి వాటా వాళ్లకు వెళుతుంది అని....ప్రభుత్వంలో ఉన్న వాళ్ళను అడ్డం పెట్టుకునే పవర్ బ్రోకర్ లింగా రెచ్చిపోతున్నారు అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు.

ఇప్పటికే విజయవాడ లో ఉన్న ఒక కీలక హాస్పిటల్, మెడికల్ కాలేజీ ని ప్రభుత్వ పెద్దల ట్రస్ట్ కు బదలాయించటానికి అవసరమైన సహకారం తానే అందించినట్లు లింగా అధికారుల వద్ద వ్యాఖ్యానిస్తుండం టీడీపీ నేతల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. తన పని పూర్తి చేసుకునేందుకు వీలుగా ఆయన ఇద్దరు కీలక నేతలకు కూడా తెరవెనక వ్యవహారాల్లో సహకారం అందిస్తూ ఆయన అనుకున్న పనులు అన్ని కూడా పూర్తి చేసుకుంటున్నట్లు చెపుతున్నారు. జెన్ కో పవర్ ప్రాజెక్ట్ విషయంలో తాను ఒక్కరే రంగంలో దిగితే కష్టం అనుకుని..ఆయన మరో పవర్ ఫుల్ మంత్రిని కూడా తన తోడుగా తెచ్చుకున్నారు. ఆ మంత్రి తన చేతికి మట్టి అంటకుండా వందల కోట్ల రూపాయలు వస్తున్నాయి అని కదా అని...ఆయన చెప్పినట్లు చేయమని కోరుతుండంతో ఎవరూ కిక్కురుమనలేని పరిస్థితి. ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడు ఈ పవర్ బ్రోకర్ డీల్స్ కొత్త కొత్త పుంతలు తొక్కుతున్నాయి అని చెపుతున్నారు.

Next Story
Share it