ఎస్వీబీసీ ఛానల్ లో పోర్న్ సైట్ల వీక్షణం
తిరుమలలోని ఎస్వీబీసీ ఛానల్ లో కొంత మంది ఉద్యోగులు వ్యవహారం కలకలం రేపుతోంది. బుధవారం నాడు ఎస్వీబీసీ ఛానల్లో పోర్న్ సైట్ లింక్ ల వ్యవహారం దుమారం రేపింది. శతమానం భవతి కార్యక్రమానికి సంబందించి ఎస్వీబీసికి ఓ భక్తుడు మెయిల్ చేశారు. ఆ భక్తుడికి తిరిగి పోర్న్ సైట్ వీడియో పంపారు అక్కడి ఎస్వీబీసి ఉద్యోగి. ఈ వ్యవహారంపై సదరు భక్తుడు టీడీడీ ఛైర్మన్, ఈవోకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పై తీవ్రంగా స్పందించిన చైర్మైన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి లు దీనిపై తక్షణమే రంగంలోకి దిగారు.
ఎస్వీబీసీ కార్యాలయంలో టీటీడీ విజిలెన్స్, సైబర్ క్రైమ్ టీమ్ లు తనిఖీలు ప్రారంభించాయి. పోర్న్ సైట్ వీడియో పంపిన ఉద్యోగితోపాటు పాటు కార్యాలయంలో పోర్న్ సైట్లు చూస్తూన్న మరో 5 గురు ఉద్యోగులను సైబర్ క్రైమ్ టీం గుర్తించింది. కార్యాలయంలో విధులు నిర్వహించకూండా అసభ్యకర వీడియోలు చూస్తున్న న్న మరో 25 మంది సిబ్బందిని గుర్తించారు.వీరందరిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం అయింది.