Telugu Gateway
Andhra Pradesh

ఒక పార్టీ నుంచి మరో పార్టీకి!

ఒక పార్టీ నుంచి మరో పార్టీకి!
X

ప్రభుత్వాలు ఎప్పటి నుంచో పేదలకు డైరెక్ట్ బెనిఫిట్ స్కీం (డీబీటీ) ద్వారా వివిధ పథకాలు అందిస్తున్నాయి. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ ఇక్కడ మాత్రం రెండు పార్టీల మధ్య కూడా డీబీటీ అమలు అవుతోంది అని అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అది కూడా నెలకు 50 కోట్ల రూపాయల మేర. అంటే సంవత్సరానికి ఆరు వందల కోట్ల రూపాయల మేర నిధుల బదిలీ జరగనుంది అన్న మాట. వివిధ మార్గాల్లో ఈ మొత్తం చేరాల్సిన వారికి చేరుతోంది. అందులో ఒక పాయింట్ లింగా బ్యాంకు కూడా ఉంది అని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ బ్యాంకు ఎక్కడ ఉంది...దీనికి ఆర్బీఐ అనుమతి ఉందా అని తెగ వెతకమాకండి.

ఎందుకంటే ఇది ఏమీ అధికారిక బ్యాంకు కాదు. అక్రమ ..అవినీతి లావాదేవీల కోసం ఒక పార్టీకి ఇది అనధికార బ్యాంకులాగా వ్యవహరిస్తోంది అంతే. ఆ పార్టీకి ఇది పెద్ద బినామీ గా వ్యవహరిస్తున్నట్లు ఏపీలోని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ఆంధ్ర ప్రదేశ్ లోని రెండు కీలక పార్టీ ల మధ్య ఈ రహస్య లావాదేవీలు సాగుతున్నట్లు సమాచారం. ఒక పార్టీ మరో పార్టీకి ఏకంగా నెలకు ఏభై కోట్ల రూపాయల మేర ముట్టచెపుతుంది అంటే...ఆ ప్రధాన పార్టీ ఆదాయం నెలకు ఎంత ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిపిస్తున్నాయి. ఆ ప్రధాన పార్టీ కూడా ఈ సారి మాత్రం గతంలో ఎన్నడూ లేని రీతిలో వ్యవహరిస్తోంది అనే విమర్శలు మూటకట్టుకుంటోంది.

స్కీంల అమలుకు డీబీటీ చూశాం కానీ...ఇలా రెండు రాజకీయ పార్టీల మధ్య కూడా డీబీటీ వ్యవహారం సాగటం బహుశా దేశంలో ఇదే మొదటిది కావొచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పొత్తులు..ఒప్పందాల సమయంలో ఇతర రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉన్న పార్టీ లు తమతో కలిసి వచ్చే వాళ్లకు వన్ టైం సెటిల్మెంట్ కింద కొంత మొత్తం ఇవ్వటం జరుగుతుంది కానీ..ఇలా ఒక పార్టీ నుంచి మరో పార్టీ నెలకు అది కూడా ఏభై కోట్ల రూపాయల రేంజ్ లో నగదు బదిలీ అన్నది పెద్ద సంచలన వ్యవహారంగా మారింది అనే చెప్పాలి.

అయితే ఇవి ఎక్కువగా అధికారికంగా కాకుండా..అనధికారికంగా వివిధ మార్గాల్లో చేరాల్సిన వాళ్లకు చేరుస్తున్నారు. దీనికి కోసం పెద్ద ఎత్తున బినామీ కంపెనీలు కూడా ఫ్లోట్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా వచ్చే డబ్బులను ఆయా కంపెనీలకు మళ్లించి ఏదో ఒక వ్యాపారం చేస్తున్నట్లు చూపించటం ద్వారా వీటికి చట్టబద్దత అంటే...వైట్ గా మార్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు చెపుతున్నారు. అందుకే బినామీ కంపెనీ ఇబ్బడి ముబ్బడిగా కొత్త కొత్త కంపెనీలను పుట్టిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఎన్ని బినామీ కంపెనీలు పెట్టినా కూడా కొద్దిగా ఆలస్యంగా అయినా ఈ వ్యవహారం బయటపడక మానదు అని చెపుతున్నారు.

Next Story
Share it