Telugu Gateway
Andhra Pradesh

రాజకీయ సినిమా....అమరావతి ఫైల్స్!

రాజకీయ సినిమా....అమరావతి ఫైల్స్!
X

రాజకీయ సినిమాల సీజన్ ప్రారంభం అయినట్లే కనిపిస్తోంది. వివాదాస్పద దర్శకడు రామ్ గోపాల్ వర్మ తాజాగా సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. రెండు రాజకీయ సినిమాల పై ప్రకటన చేశారు. ఈ తరుణములో ఒక ఆసక్తికర సమాచారము వెలుగు చూసింది. అదేంటి అంటే అమరావతి ఫైల్స్ పేరు తో కూడా ఒక సినిమా తెరకెక్కనుంది అనేది ఈ సమాచారం. ఈ సినిమా వెనక ఎవరు ఉన్నారు..దీని నిర్మాతలు ఎవరు అన్న అంశం పై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అండ తోనే ఈ సినిమా తెరకెక్కనున్నట్లు చెపుతున్నారు. ఏపీలో ఇప్పుడు రాజకీయం అంతా ఒక వైపు అమరావతి, మరో వైపు మూడు రాజధానులు చుట్టూనే తిరుగుతున్నా విషయం తెలిసిందే.

ప్రతిపక్షములో ఉండగా అమరావతి కి ఓకే చెప్పిన జగన్ తర్వాత పరిపాలన వికేంద్రీకరణ పేరుతో మాట మార్చిన విషయం తెలిసిందే. దీంతో రాజకీయ రగడ మొదలైంది. ఒక వైపు సీఎం జగన్ ఎలాగైనా మూడు రాజధానుల విషయంలో ముందుకు వెళ్ళటానికే మొగ్గు చూపుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు మాత్రం అమరావతి ఒకే ఒక రాజధాని అంటూ ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. భూములు ఇచ్చిన రైతులు గత కొంతకాలంగా పాదయాత్రలు చేస్తున్నారు, ఈ విషయాలు అన్ని అమరావతి ఫైల్స్ సినిమా లో చోటుచేసుకునే అవకాశం ఉందని సమాచారం. అధికార పార్టీ మాత్రం ఇది అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం అని ఆరోపిస్తోంది.

Next Story
Share it