Telugu Gateway
Andhra Pradesh

మోడీకి మద్దతు ఇచ్చినా ..ఏపీకి మరో సారి నిరాశే

మోడీకి మద్దతు ఇచ్చినా ..ఏపీకి మరో సారి నిరాశే
X

పోలవరం పై ఎప్పటిలాగానే తీయటి మాటలు

చంద్రబాబు, పవన్ కు రాజకీయంగా చిక్కులే!

ఆంధ్ర ప్రదేశ్ ను ప్రధాని నరేంద్ర మోడీ మరో సారి మోసం చేశారా?. అంటే అవుననే సమాధానం వస్తోంది. కేంద్రంలో మోడీ సర్కారు ఆధారపడింది టీడీపీ, జేడీయూ ల మద్దతుపైనే . అయినా కూడా రాష్ట్రానికి సాయం చేసే విషయంలో ఎప్పటిలాగానే మోసపూరిత విధానాలు అమలు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి వివిధ అభివృద్ధి ఏజెన్సీలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15000 కోట్ల రూపాయల ఇప్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఆమె చెప్పిన మాటలు...బడ్జెట్ కాఫీలో డ్రాఫ్టింగ్ చూస్తే మాత్రం ఈ మొత్తం రుణంగా ఇప్పించబోతున్నట్లు కనిపిస్తుంది తప్ప...ఎక్కడా బడ్జెట్ సపోర్ట్ తో గ్రాంట్ రూపంలో ఇస్తున్నట్లు కనిపించటం లేదు అని అధికార వర్గాలు కూడా చెపుతున్నాయి. విభజన చట్టం ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ కు సాయం అందించటానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ప్రకటించారు. అమరావతి కి ఈ ఆర్థిక సంవత్సరంలో 15000 వేల కోట్ల రూపాయలు ఇప్పించటం తో పాటు రాబోయే సంవత్సరాల్లో అదనపు నిధులు కూడా అందిస్తామని చెప్పుకొచ్చారు. అమరావతి కి ఇస్తున్నది అప్పు అనే సంకేతాలు ఆ డ్రాఫ్టింగ్ ..నిర్మల సీతారామన్ మాటలు చూస్తే స్పష్టం అవుతుంది అని...ఇక పోలవరం విషయానికి వస్తే ప్రకటన తప్ప...కేటాయింపులు ఏమి చేయలేదు. పోలవరం విషయంలో గత పదేళ్లుగా మోడీ సర్కారు ఇదే తరహా మాటలు చెపుతూ వస్తోంది.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితం ప్రధాని మోడీ తో పాటు హోమ్ మంత్రి అమిత్ షా తో కలిసి ఆంధ్ర ప్రదేశ్ కు సాయం సాధించాలని కోరిన విషయం తెలిసిందే. కానీ నిర్మలా సీతారామన్ ప్రకటన చూస్తే మాత్రం కేంద్రం అమరావతి కి ఇప్పిస్తుంది అప్పు తప్ప...మోడీ సర్కార్ సాయం చేస్తున్నట్లు ఏమి లేదు అనే చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో రాజధానికి కేంద్రం ఇంత భారీ మొత్తంలో అంటే ఒకే ఏడాది ఏకంగా పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించటం అన్నది ఖచ్చితంగా సానుకూల అంశంగానే చెప్పుకోవచ్చు. అయితే కేంద్రం అటు ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేకంగా ఏమి చేయలేదు అనే విషయం మాత్రం పూర్తి స్థాయిలో మోడీ కి మద్దతుగా నిలుస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు రాజకీయంగా ఇది రాబోయే రోజుల్లో ఇబ్బందిగా మారటం ఖాయం అనే చెప్పొచ్చు. ఈ ఆర్థిక సంవత్సరం లో వచ్చే పదిహేను వేల కోట్ల రూపాయలతో అమరావతి పనులు ఎంత వేగంగా పరుగులు పెడతాయి అన్నది చంద్రబాబు మీద ఆధారపడి ఉంటుంది. కేంద్రం ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ చూసిన తర్వాత అండగా నిలబడ్డ ఏపీకి...చంద్రబాబు సర్కారుకు మోడీ ప్రత్యేకంగా ఏమి చేయలేదు అనే చర్చ మాత్రం తెరమీదకు వచ్చింది.

Next Story
Share it