Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో 80 శాతానికి పైగా పంచాయతీలు వైసీపీవే

ఏపీలో 80 శాతానికి పైగా పంచాయతీలు వైసీపీవే
X

ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఎవరి లెక్కలు వారు చెబుతున్నారు. అయితే ఇందులో ఓ విచిత్రం ఉంది. ఎన్నికలు సక్రమంగా జరిగితే తమకంటే తమకు మరిన్ని సీట్లు వచ్చేవి అని అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీలు ప్రకటించటమే విచిత్రం. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ''ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏదో సాధించాలని చతికిలపడ్డారు. టీడీపీ పునాదులు కదులుతున్నా అసత్య కథనాలు రాయిస్తున్నారు. 80.37 శాతం పంచాయతీలను వైసీపీ మద్దతుదారులు గెలిచారు. ఎన్నికలు సజావుగా జరిగితే 90 శాతానికి పైగా గెలిచేవాళ్లం. సీఎం జగన్ సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారు. ప్రజాస్వామ్యానికి అద్దం పట్టేలా ఫలితాలు వచ్చాయి.

కుప్పం ఫలితాలే చంద్రబాబుపై వ్యతిరేకతకు నిదర్శనం. మున్సిపల్ ఎన్నికల్లో ఇంతకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని' మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఆయన సోమవారం నాడు మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉంటే రామచంద్రారెడ్డి అధ్యక్షతన కృష్ణా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ జరిగింది. మున్సిపల్‌ ఎన్నికలపై మంత్రి పెద్దిరెడ్డి వారితో చర్చించారు. సీఎం జగన్ ను కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలుపొందడంపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సీఎం వైఎస్‌ జగన్‌ అభినందించారు.

Next Story
Share it