Telugu Gateway
Andhra Pradesh

అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేశవ్

అసెంబ్లీలో  బడ్జెట్ ప్రవేశపెట్టిన కేశవ్
X

ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సీజన్డ్ పొలిటీషియన్. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో ఎవరైనా..అంటే ఏ ఆర్థిక మంత్రి అయినా అందులోని కంటెంట్ గురించే ఎక్కువ ఫోకస్ పెడతారు. ఏ మంత్రి అయినా ముఖ్యమంత్రి పై పొగడ్తల వర్షం కురిపించటం సహజమే. కాకపోతే పయ్యావుల కేశవ్ మాత్రం బడ్జెట్ ప్రసంగంలో సైతం ఈ పొగడ్తల డోస్ పెంచినట్లు ఉంది అనే చర్చ సాగుతోంది. కొద్ది నెలల క్రితం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పై పయ్యావుల కేశవ్ కురిపించిన పొగడ్తల వర్షం చూసి ఐఏఎస్ లు కూడా షాక్ అయ్యారు. ఐఏఎస్ లు అంతా బ్లైండ్ గా సీఎం చంద్రబాబు ఏమి చెపితే అది చేస్తే చాలు సరిపోతుంది అని..సొంతంగా ఎలాంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు అన్నారు. ఇంకా చాలానే చెప్పారు.

ఇప్పుడు బడ్జెట్ ప్రసంగంలో సైతం చంద్రబాబు విజన్ ...దూరదృష్టి అంటూ ఎన్నో విషయాలు ప్రస్తావించారు. సరే చంద్రబాబు పై పొగడ్తల వర్షం డోస్ పెంచినా ఒకే అనుకుందాం. కానీ ఇప్పటికే నెక్స్ట్ జనరేషన్ అంటే చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ పై కూడా బడ్జెట్ స్పీచ్ లో పయ్యావుల కేశవ్ పొగడ్తలు కురిపించటం చర్చనీయాంశం అయింది. లోకేష్ కస్టపడి రాష్ట్రానికి ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ తో పాటు డేటా సెంటర్ లు ...వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సాగిస్తున్నట్లు ప్రశంసించారు. అయితే దీన్ని తప్పు పెట్టాల్సిన అవసరం లేకపోయినా బడ్జెట్ ప్రసంగంలో ఈ అసలు ఈ విషయాలు ప్రస్తావించటం అవసరమా అన్నదే పాయింట్. అటు చంద్రబాబు, నారా లోకేష్ తో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కూడా కేశవ్ ప్రశంసలు కురిపించారు. కేశవ్ తన బడ్జెట్ స్పీచ్ ద్వారా పొగడ్తలను నెక్స్ట్ జెనరేషన్ కు కూడా ఎక్స్ టెన్షన్ చేసి...తన పదవి ని పది కాలాలపాటు సురక్షితంగా ఉండేలా చూసుకుంటున్నారు అనే వ్యాఖ్యలు పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి.

శుక్రవారం ఉదయం ఏపీ 2025-26 వార్షిక బడ్జెట్‌కు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ...ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ దీన్ని సభ ముందు పెట్టారు. మొత్తం రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌ను రూపొందించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఇందులో వ్యవసాయానికి రూ.48,340 కోట్లు, వయబులిటీ గ్యాఫ్‌ ఫండ్‌ రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.ఎస్సీల గృహ నిర్మాణానికి రూ.50 వేలు, ఎస్టీల గృహ నిర్మాణానికి రూ.70 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు ఎన్టీఆర్‌ వైద్య భరోసాకు రూ.31,613 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు.

Next Story
Share it