Telugu Gateway
Andhra Pradesh

సింగపూర్ వెళ్లనున్న ఉప ముఖ్యమంతి

సింగపూర్ వెళ్లనున్న ఉప ముఖ్యమంతి
X

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనయుడు అగ్నిప్రమాదంలో చిక్కుకున్నాడు. పవన్ చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్ లో చదువుతున్నాడు.ఆ స్కూల్ లో అగ్నిప్రమాదం జరగటంతో మార్క్ శంకర్ చేతికి..కాళ్లకు గాయాలు అయ్యాయి అని జనసేన అధికారికంగా వెల్లడించింది. ఊపిరి తిత్తుల్లోకి పొగ వెళ్లటంతో మార్క్ శంకర్ ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు. మార్క్ శంకర్ ప్రమాదం విషయం తెలిసిన వెంటనే పార్టీ నాయకులు..అధికారులు వేంటనే సింగపూర్ బయలుదేరి వెళ్లాల్సిందిగా సూచించారు.

అయితే పవన్ కళ్యాణ్ మాత్రం మాట ఇచ్చినట్లు అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని, ఆ గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకొంటానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు అని ఒక ప్రకటనలో తెలిపారు. అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటన ముగిసిన వెంటనే వైజాగ్ చెరుకుని పవన్ కళ్యాణ్ అక్కడ నుంచే సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story
Share it