Telugu Gateway
Andhra Pradesh

ప్రచారానికి పవన్ రిప్లయ్ ఇది

ప్రచారానికి పవన్ రిప్లయ్ ఇది
X

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ , అయన భార్య అనా కొణిదెల బుధవారం నాడు వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్ లోని నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను పవన్ కళ్యాణ్, అనా కొణిదెల దంపతులు నిర్వర్తించారు. కొద్ది రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో మంగళగిరి చేరుకుంటారు. గత కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ప్రచారానికి కౌంటర్ ఇచ్చేందుకే ఈ ఫోటో విడుదల చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ మూడవ భార్య ఆయనతో ఉండటం లేదు అని..ఆమె కూడా విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది అంటూ ప్రచారం తెరపైకి తెచ్చారు. కొద్ది రోజుల క్రితం ఒక బహిరంగ సభలో సీఎం జగన్ కూడా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూ అయన నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు అంటూ విమర్శించారు. దీనికి జనసేన అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా గట్టి కౌంటర్లు ఇచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ఈ ఫోటో షేర్ చేసి ప్రచారానికి తెరదించారు అనే చెప్పొచ్చు.

Next Story
Share it