వారాహీలోనే వస్తా..ఏమి చేస్తారో చూస్తా
వ్యూహం నాకు వదిలేయండి..మీరు పని చేయండి అంటూ నేతలు..కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తాను అనే మాటకు ఇప్పటికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. గత ఎన్నికల్లో కూడా పాత పొత్తు కొనసాగి ఉంటే వైసీపీ గెలిచేదే కాదు అన్నారు. ఈ మధ్య జనసేన అధినేత కొనుగోలు చేసిన వారాహి వాహనంపై పెద్ద ఎత్తున రాజకీయ వివాదం సాగిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్...వారాహీలోనే వస్తా ...ఏమి చేస్తారో చూస్తా అంటూ సవాల్ విసిరారు. వారాహి రంగు ఏంటి...ఎత్తు ఎంత..బరువు ఎంత అంటూ చాలా మాట్లాడారు...మీరు దోచుకుంది ఎంతో చెప్పండి అంటూ ఛాలెంజ్ చేశారు.
వైసీపీ ప్రభుత్వం చిల్లర వేషాలు వేస్తుంది అంటూ మంది పడ్డారు. తాను వారానికి ఒకేసారి వస్తేనే ఆగమాగం అవుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ, టీడీపీ లకు అమ్ముడు పోయే ఖర్మ తనకు పట్టలేదన్నారు. పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు సత్తెనపల్లి నియోజకవర్గంలో కౌలు రైతు భరోసా యాత్రలో పాల్గొని మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవదు ...గెలవనివ్వం అంటూ ప్రకటించారు. అంబటి రాంబాబుది శవాల మీద పేలాలు ఏరుకునే మనస్తత్వమని, పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని ఆయన ఒక మంత్రా? అని ప్రశ్నించారు.తనపై బాధ్యత లేకుండా మాట్లాడే వైసీపీ నాయకులకు సరైన సమాధానం చెబుతానన్నారు. తన సినిమాలు ఆపేసినా భయం లేదన్నారు.