Telugu Gateway
Andhra Pradesh

సీఎం అటవీ శాఖ టార్గెట్ వెనక కథ ఏంటి?!

సీఎం అటవీ శాఖ టార్గెట్ వెనక కథ ఏంటి?!
X

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటు పార్టీ విషయంతో పాటు ఇటు ప్రభుత్వం విషయంలోనూ నాన్ సీరియస్ అనే ప్రచారం ఆ పార్టీ వర్గాల్లోనే ఉంది. రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సమావేశానికి కూడా ఆయన దూరంగా ఉన్నారు. అంతే కాదు..శుక్రవారం నాడు వెలగపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టారు. అటు కలెక్టర్ల సమావేశానికి ...ఇటు మంత్రి వర్గ సమావేశానికి డుమ్మాలు కొట్టిన పవన్ కళ్యాణ్ శనివారం నాడు పాడేరు నియోజకవర్గంలో జరిగే జనసేన ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. దీంతో అసలు కూటమి ప్రభుత్వంలో ఏమి జరుగుతుంది అనే చర్చ సాగుతోంది. కేవలం తన కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పనుల కోసమే ఆయన కీలక సమావేశాలకు డుమ్మాకొట్టినట్లు అంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది.

ఇది ఇలా ఉంటే కలెక్టర్ల సమావేశం వేదికగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చూస్తున్న అటవీ శాఖ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించిన తీరు చూసిన వాళ్లకు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది అంతా పవన్ కళ్యాణ్ టార్గెట్ గానే నడిచిందా అన్న చర్చ జనసేన వర్గాల్లో ఉంది. ఎంతో కాలం నుంచి చెపుతున్నా కూడా అటవీ శాఖ అధికారుల్లో ఏ మాత్రం మార్పు రావటం లేదు అని సీఎం చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో తీవ్ర విమర్శలు చేసారు. అంటే పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న అటవీ శాఖ తీరు ఏ మాత్రం బాగా లేదు అనే విషయం చెప్పకనే చెప్పినట్లు అయింది అనే చర్చ సాగుతోంది. ఇదే అంశంపై మీడియా లో కూడా చాలా ప్రముఖంగా వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ చివరకు అటవీ శాఖలో కూడా ఫెయిల్యూర్ అయ్యారు అనే విధంగా చంద్రబాబు ఫోకస్ నడిచినట్లు ఉంది అనే చర్చ సాగుతోంది.

ఇక్కడ కీలకమైన విషయం ఏమిటి అంటే నాలుగు సార్లు తాను ముఖ్యమంత్రిగా పని చేశాను అని చెపుతున్న చంద్రబాబుకు అటవీ చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో తెలియదా అని ఒక అధికారి ప్రశ్నించారు. ఎవరు చెప్పినా కూడా అటవీ శాఖ చట్టాల విషయంలో అధికారులు ఇష్టానుసారం నిర్ణయం తీసుకోవటం సాధ్యం కాదు అని ఆయన అన్నారు. అన్ని విషయాలు తెలిసి కూడా చంద్రబాబు కేవలం ఈ ఒక్క శాఖను ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్లు ఉంది అనే చర్చ అధికార వర్గాల్లో కూడా సాగుతోంది. కూటమి ప్రభుత్వంలో పైకి అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా లోపల లోపాల మాత్రం ఒకరినొకరు దెబ్బ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి ఇంకెన్ని మలుపులు తీసుకుంటాయో చూడాలి.

Next Story
Share it