Telugu Gateway
Andhra Pradesh

ఫ్రేమించటం లేదని చంపేశాడు

ఫ్రేమించటం లేదని చంపేశాడు
X

విజయవాడలో దారుణం జరిగింది. ఓ ఉన్మాది తనను ప్రేమించటం లేదని ఏకంగా అమ్మాయి ఇంటికి వెళ్లి మరీ గొంతులో పొడిచాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు అందరూ షాక్ కు గురయ్యారు. అమ్మాయిని పొడిచిన కత్తితోనే తనకు తాను కూడా గాయాలు చేసుకున్నాడు. విజయవాడలోని క్రీస్తురాజపురం ప్రాంతానికి దివ్య తేజస్విని ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతోంది. స్థానికంగా ఉంటూ పెయింటర్‌గా పని చేస్తున్న స్వామి కొంతకాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే అతని ప్రేమను ఆమె తిరస్కరించింది.

తన ప్రేమను నిరాకరించిందని కక్ష కట్టిన స్వామి.. గురువారం యువతి ఇంటికి వెళ్లాడు. ఇదే విషయంలో వారిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దాంతో కోపోద్రేకుడైన స్వామి కత్తితో దివ్య తేజస్వినిపై దాడి చేశారు. మెడపై తీవ్ర గాయాలు కావడంతో ఆమెను స్థానికంగా ఉన్న ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రస్తుతం స్వామి కూడా గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story
Share it