Telugu Gateway
Andhra Pradesh

టాలీవుడ్ టాప్ హీరోల అభినందనలు

టాలీవుడ్ టాప్ హీరోల అభినందనలు
X

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు అయిన ఎన్టీఆర్ స్పందించారు. ఆయన గత కొంతకాలంగా ఎన్ని విమర్శలు వచ్చినా సరే రాజకీయ అంశాలపై స్పందించకుండా వస్తున్నారు. చారిత్రిక విజయాన్ని అందుకున్న మామయ్య చంద్రబాబుకు, అద్భుతమైన మెజారిటీ తో గెలిచినా నారా లోకేష్, హ్యాట్రిక్ కొట్టిన బాబాయ్ బాలకృష్ణ కు ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. మీ ఈ విజయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపిస్తుంది అని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపీలుగా గెలిచిన దగ్గుబాటి పురేందేశ్వరి, భరత్ లకు కూడా అబ్బినన్దలు తెలిపారు.

మరో ట్వీట్ లో పిఠాపురంలో ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ కు శుభాకంక్షాలు తెలిపారు. ఎన్టీఆర్ తో పాటు మహేష్ బాబు కూడా ఏపీ లో కొత్తగా విజయం సాధించిన ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి అయిన వెంటనే అల్లు అర్జున్ పిఠాపురంలో ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ కు విషెస్ చెప్పారు. రామ్ చరణ్ కూడా దార్శనికుడు చంద్రబాబు కు శుభాకాంక్షలు, అద్భుతమైన విజయం సాధించారు అంటూ పేర్కొన్నారు.

Next Story
Share it