Telugu Gateway
Andhra Pradesh

సీఈఓ కోరిక మేరకే వెనక్కు !

సీఈఓ కోరిక మేరకే వెనక్కు !
X

పీ 4 నిధుల్లో భారీ ఎత్తున గోల్ మాల్ జరిగినట్లు తెలుగు గేట్ వే. కామ్ లో ప్రచురించిన వార్తపై స్వర్ణాంధ్ర పీ 4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ సి. కుటుంబ రావు స్పందించారు. తమ దగ్గర ఎలాంటి సిఎస్ఆర్ నిధులు దుర్వినియోగం జరగలేదు తెలిపారు. తమ ఫౌండేషన్‌ అత్యంత పారదర్శకతతో P4 మోడల్ అనే కొత్త భావనను వివరించి అమలు చేయడానికి కృషి చేస్తోంది అని వెల్లడించారు. మరో వైపు సీఈవో తీసుకునే నిర్ణయాలు కూడా ఎప్పటికప్పుడు ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పరిశీలనలోనే ఉంటాయన్నారు. స్మార్ట్ ఆంధ్ర ప్రదేశ్ ఫౌండేషన్ సీఈఓ నరేష్ కుమార్ కోరిక మేరకే ఆయన్ను మాతృ సంస్థకు పంపాలని కోరితే దానికి అనుగుణంగానే ఆయన్ను వెనక్కి పంపినట్లు కుటుంబ రావు వెల్లడించారు. అయితే ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే ఈ పోస్ట్ కోసం ఎంతో మంది దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు ఎవరిని కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్సయిజ్ శాఖకు చెందిన సి హెచ్ నరేష్ కుమార్ ను సీఈఓ పోస్ట్ కు ఎంపిక చేసినట్లు మీడియా లో వార్తలు వచ్చాయి.

ఏకంగా ముఖ్యమంత్రి ఏరికోరి తెచ్చిన వ్యక్తి ఆరు నెలలు కూడా కాకముందే తన మాతృ సంస్థకు వెళతానని అడగటం...దీనికి తాము ఆమోదం తెలిపామని కుటుంబ రావు చెపుతున్నారు. సెక్షన్ 8 కి సంబంధించిన నియమ, నిబంధనలు పాటించటం వంటి ఇబ్బందుల కారణంగా అయన తప్పుకున్నట్లు కుటుంబ రావు వెల్లడించారు. సీఎం ఏరికోరి తీసుకొచ్చిన వ్యక్తి కేవలం కొద్ది నెలలు మాత్రమే పని చేయటం...అది కూడా ఎంతో మందిని కాదు అని తీసుకున్నా వ్యక్తి ఇలా చేయటం వెనక మతలబు ఏమిటా అన్న చర్చ టీడీపీ ఎమ్మెల్యేల్లో సాగుతోంది. అయితే కుటుంబ రావు చెపుతున్నట్లు పేదల కోసం కేటాయించిన నిధులు దుర్వినియోగం కాకపోతే మంచిదే. అయితే అధికార టీడీపీ ఎమ్మెల్యేలే నరేష్ కుమార్ తీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Next Story
Share it