Telugu Gateway
Andhra Pradesh

వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు

వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు
X

పంచాతీయ ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికలకు సహకరించకపోతే కేంద్ర ఉద్యోగుల సాయం తీసుకుంటామని ...ఇది ప్లాన్ బీ మాత్రమే అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో వ్యాక్సినేషన్ కొనసాగింపునకు ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ఎన్నికల విధులకు వలంటీర్లను దూరంగా ఉంచాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో నిధుల సమస్యపై ప్రత్యేకంగా ప్రస్తావించిన పలువురు కలెక్టర్లు. ఈ సమావేశాలు అధికారులకు పలు సూచనలు చేశారు. ఏకగ్రీవాలను స్వాగతించండి.. కానీ ఎన్నికల నిర్వహణే ప్రధమ ప్రాధాన్యం కావాలన్నారు. ప్రత్యేక అధికారి సంజయ్ ఏకగ్రీవాల బాధ్యతలు చూస్తారన్నారు.

ఏకగ్రీవాలు బలవంతంగా అవుతున్నాయా? లేదా అన్నదే పర్యవేక్షిస్తారని చెప్పారు. తరువాత స్థానాల్లో సంక్షేమం కూడా తీసుకోవాలని, కాల్‌ సెంటర్ల ద్వారా ఫిర్యాదులు స్వీకరించాలని నిమ్మగడ్డ సూచించారు. వెబ్‌కాస్టింగ్‌తో ఉపయోగం లేదని, పోలింగ్‌ కేంద్రం చుట్టూ కొంత ప్రాంతాన్నే అది కవర్‌ చేస్తుందని నిమ్మగడ్డ వ్యాఖ్యానించారు. వెబ్‌కాస్టింగ్‌ కోసం కొత్త యాప్‌‌ను తీసుకువచ్చామని, ఆ యాప్‌ ద్వారా పోలింగ్‌ కేంద్రాల దగ్గర జరిగేదంతా తెలుసుకోవచ్చునని అన్నారు. యాప్‌ ద్వారా వీడియోలతో పాటు ఎస్ఎంఎస్ కూడా పంపవచ్చునని రమేష్ కుమార్ పేర్కొన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యాక్సినేషన్‌తో పాటు ఎన్నికల నిర్వహణపై చర్చించామన్నారు. ఎన్నికల నిర్వహణలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని డీజీపీ వ్యాఖ్యానించారు.

Next Story
Share it