Telugu Gateway
Andhra Pradesh

ఏపీ స‌ర్కారుపై ఎన్జీటీ సీరియ‌స్

ఏపీ స‌ర్కారుపై ఎన్జీటీ సీరియ‌స్
X

రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై గ‌త కొన్ని రోజులుగా రాజ‌కీయ ర‌గ‌డ జ‌రుగుతోంది. అక‌స్మాత్తుగా మ‌ళ్లీ ఈ అంశాన్ని తెర‌పైకి తెచ్చి కృష్ణా బోర్డు కు ఫిర్యాదు చేశారు. బోర్డు కూడా వెంట‌నే స్పందించి ప‌నులు ఆపాల‌ని ఆదేశించింది. ఇప్పుడు తాజాగా ఎన్జీటీ కూడా రంగంలోకి దిగింది. తెలంగాణ కు చెందిన జి. శ్రీనివాస్ ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన ఎన్జీటీ చెన్నై ధర్మాసనం.. ఎత్తిపోతల తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డును ఆదేశించింది. తదుపరి విచారణను జులై 12కు వాయిదా వేసింది.

రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపడితే జైలుకు పంపుతామంటూ సీఎస్‌ను హెచ్చరించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు జరపొద్దని గతంలో ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ ఆదేశాలు ఉల్లంఘిస్తూ పనులు చేస్తున్నారని తెలంగాణ‌ మంత్రులు, నేత‌లు ఆరోపిస్తున్నారు.

Next Story
Share it