Telugu Gateway
Andhra Pradesh

అక్కడ తెర ముందు...ఇక్కడ తెర వెనక..అంతే తేడా !

అక్కడ తెర ముందు...ఇక్కడ తెర వెనక..అంతే తేడా !
X

ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం ప్రధాన భాగస్వామిగా ఉన్న కూటమి సర్కారులో కూడా ఒక సకల శాఖా మంత్రి పుట్టుకొస్తున్నారా?. అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సజ్జల రామకృష్ణా రెడ్డి కి స్వయంగా టీడీపీ నేతలే ఈ పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఎందుకంటే ఎలాంటి విధాన నిర్ణయాలు అయినా..అటు పార్టీ పరంగా...ఇటు ప్రభుత్వ పరంగా అన్ని విషయాలు అప్పట్లో సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డి మాత్రమే మీడియా ముందుకు వచ్చి చెప్పేవారు. కొన్నిసార్లు ఏదో మొక్కుబడిగా మంత్రులను పక్కన పెట్టుకునే వారు. అయితే టీడీపీ విషయానికి వస్తే ఇప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్న ఈ శాఖల శాఖా మంత్రి తెర ముందుకంటే తెర వెనక ఉండే పనులు చేయాల్సిందిగా..ఫైల్స్ క్లియర్ చేయాల్సిందిగా పలువురు మంత్రులకు తరచూ ఫోన్లు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలే చెపుతున్నాయి. కిమ్ గా పిలవబడే ఈ తెరవెనక సకల శాఖా మంత్రికి కొంత మంది సీనియర్లు ఝలక్ కూడా ఇచ్చినట్లు చెపుతున్నారు.

కొత్తగా క్యాబినెట్ లో చేరినవాళ్లు మాత్రం కిమ్ చెప్పిన మాటల ప్రకారం ఫైల్స్ క్లియర్ చేస్తుంటే...ఇద్దరు సీనియర్లు మాత్రం తాము కిమ్ ఎవరి పేరు చెప్పి ఫైల్స్ క్లియర్ చేయాలనీ చెప్పారో ..ఆ వ్యక్తులతోనే మాట్లాడతాం అని చెప్పినట్లు ఒక మంత్రి వెల్లడించారు. దీంతో చేసేది ఏమి లేక మౌనంగా ఉన్నట్లు చెపుతున్నారు. అంతే కాదు..రాయలసీమ ప్రాంతానికి చెందిన నూతన మంత్రి కూడా కిమ్ చెప్పిన మాటలను లైట్ తీసుకుని తర్వాత చూస్తానులే..తనకు తెలుసు అని చెప్పినట్లు సమాచారం. ఒక వైపు పార్టీ లో ..ఇటు ప్రభుత్వంలో కూడా ఆయన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వంలోని కీలక మంత్రి అండదండలతోనే ఆయన రెచ్చిపోతున్నారు అని టీడీపీ వర్గాలు చెపుతున్నాయి. కొత్తగా వచ్చిన జూనియర్ మంత్రులకు అయితే ఏకంగా ఆయన ఆదేశాలే జారీ చేస్తున్నట్లు చెపుతున్నారు. చూడాలి ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఎన్ని మలుపులు తిరుగుతుందో.

Next Story
Share it