బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు
BY Admin29 March 2021 8:32 PM IST

X
Admin29 March 2021 8:32 PM IST
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్, లోకేష్ లే కాకుండా పార్టీలో కొత్త నాయకత్వం రాబోతుందని..వివిధ సామాజిక వర్గాల నుంచి యువ నేతలు రాబోతున్నారని అన్నారు. టీడీపీ 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన వేడుకల్లో టీడీపీలో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయంటూ ఆయన వెల్లడించారు. టీడీపీలో కొత్త నాయకత్వం రాబోతోందంటూ ఆయన చేసిన కీలక వ్యాఖ్యల వెనక కారణాలు ఏమై ఉంటాయా అన్న చర్చ సాగుతోంది. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం గతంలో ఎన్నడూలేని రీతిలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది.
Next Story