వరస పరిణామాలతో వైసీపీ లో టెన్షన్ టెన్షన్!
అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్న తర్వాతే రాజీనామా చేశారు అని చెపుతున్నారు. అసంతృప్తితో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని బుజ్జగించేందుకు వైసీపీ అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ విషయాన్ని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బహిరంగంగానే చెప్పిన విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు అవకాశాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది అని వైసీపీ నేతలు అంగీకరిస్తున్నారు. వివిధ కారణాలతో ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఇందులో సీనియర్ నేతలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి ఉన్నారు. తాజాగా రాజ్య సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఇదే మార్గాన్ని ఎంచుకున్నారు. రాబోయో రోజుల్లో ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సిందే.