పెళ్లికి ఒప్పుకోలేదని తుపాకీ కాల్చేసి..తానూ కాల్చుకున్నాడు
ఇద్దరూ ఐటి ఉద్యోగులు. ఒకే ఊరు. అమ్మాయిని ప్రేమిస్తున్నానని..పెళ్లి చేసుకుంటానని కుటుంబ సభ్యుల ముందు ప్రతిపాదన పెట్టాడు ఆ అబ్బాయి. అందుకు అమ్మాయి నో చెప్పటంతో ఆమె తల్లిదండ్రులు కూడా పెళ్ళి ప్రతిపాదనను తిరస్కరించారు. దీంతో ఏకంగా అబ్బాయి గన్ తో అమ్మాయిని తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తాను కూడా తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. ఈ వ్యవహరం నెల్లూరు జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేపింది. అబ్బాయికి తనకు మధ్య వయస్సు తేడా చాలా ఎక్కువ ఉండటంతో అమ్మాయి ఈ ప్రతిపాదనను తిరస్కరించిందని..ఆమె ఒప్పుకోకపోవటంతో కుటుంబ సభ్యులు కూడా అదే మాటను చెప్పారని ఆమె బంధువులు తెలిపారు. మీడియా ప్రచారం చేస్తున్నట్లు వారిద్దరి మధ్య ప్రేమ లేదని..కేవలం అది వన్ సైడ్ లవ్ మాత్రమే అని తెలిపారు.
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలో సోమవారం జరిగిన కాల్పుల వ్యవహారం సంచలనంగా మారింది. కాల్పులు జరిపిన వ్యక్తిని సురేష్‌రెడ్డిగా గుర్తించారు. బాధితురాలిని కావ్యగా గుర్తించిన పోలీసులు.. ఆస్పత్రికి తరలించే క్రమంలో ఆమె మృతి చెందినట్లు చెబుతున్నారు. మృతులిద్దరూ తాటిపర్తి వాసులే కాగా.. బెంగుళూరు లో ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. అయితే సురేష్ రెడ్డికి తుపాకీ ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదని ఎస్పీ తెలిపారు. దీనిపై మేడ్ ఇన్ యూఎస్ ఏ అని ఉందని వెల్లడించారు. ఏడాదిగా యువతిని సురేష్ రెడ్డి యువతి వేదిస్తున్నాడని తెలిపారు. మొదటి బుల్లెట్ నుంచి కావ్య తప్పించుకున్నా కూడా మళ్లీ వెంటనే కాల్పులు జరిపాడని..అడ్డం వచ్చిన కావ్య చెల్లిని కూడా పక్కకు నెట్టినట్లు ఎస్పీ విజయారావు తెలిపారు. రెండో బుల్లెట్ కావ్య తల నుంచి దూసుకెళ్ళిందని తెలిపారు.