లోకేష్ వివాదస్పద ట్వీట్
తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్వీట్ దుమారం రేపేదిలా ఉంది. మంగళవారం నాడు మీడియాలో సమావేశంలో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి చంద్రబాబు నిర్వాకంతోనే పెట్రోల్,, డీజిల్ ధరలు పెరిగాయంటూ వ్యాఖ్యానించారు. దీనిపై లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. లోకేష్ ట్వీట్ ఇలా ఉంది. ' వైసిపికి చెందిన మంత్రుల నుండి ముఖ్యమంత్రి వరకూ.. ఎమ్మెల్యేల నుంచి సలహాదారుల వరకూ ఓ రెండు విషయాలకు మాత్రమే చంద్రబాబు గారిని బాధ్యుడ్ని చేయడంలేదు. అవేంటంటే.. వారికి పుట్టిన పిల్లలు, వారు సంపాదించిన అక్రమాస్తులు.
దేశంలో ఎక్కడాలేని విధంగా 31 శాతం వ్యాట్+లీటరుకి రూ.4 అదనపు వ్యాట్+లీటరుకి 1రూపాయి రోడ్డు అభివృద్ధి సుంకం వేసి లీటర్ పెట్రోల్ కి రూ.30 భారం సామాన్యులపై మోపిన దరిద్ర చరిత్ర జగన్‌రెడ్డిది. ఆత్మలతో మాట్లాడుతున్న లండన్ పిచ్చిరెడ్డి గారి పిచ్చి ఏమైనా అంటుకుందా బాబుగారి జపం చేస్తున్నావు. పెట్రోల్, డీజిల్ ధరలు మీ పాలనలో ఏ రేంజులో వున్నాయో తెలుసుకోవాలంటే సరిహద్దులోని తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ బంకుల్లో బోర్డులు చూడు. ఏపీ కంటే తక్కువ ధరలనే బోర్డులు చూసైనా చంద్రబాబు గారిపై ఏడుపు ఆపు' అంటూ వ్యాఖ్యానించారు.