Telugu Gateway
Andhra Pradesh

ఈ కలయిక సంకేతం ఏంటో !

ఈ కలయిక సంకేతం ఏంటో !
X

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్. దేశంలోనే పేరుగాంచిన ఎన్నికల వ్యూహకర్త ల్లో ఐ ప్యాక్ కు చెందిన ప్రశాంత్ కిషోర్ ఒకరు అనే విషయం తెలిసిందే. ప్రశాంత్ కిషోర్ గత ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ గెలుపునకు వ్యూహలు రచించారు..అవి సక్సెస్ అయ్యాయి. కానీ అప్పట్లో ప్రశాంత్ కిషోర్ పై తెలుగు దేశం పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది. ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రశాంత్ కిషోర్ పనిచేశాడు అని ఆరోపించింది. ఇప్పటికీ ఐ ప్యాక్ టీం లు ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైసీపీ కోసం పని చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం చేస్తున్న అభ్యర్థుల మార్పులతో పాటు పార్టీ కార్యక్రమాల రూపకల్పనలో కూడా ఐ ప్యాక్ టీం ల పాత్రే కీలకం అని వైసీపీ నేతలు చెపుతున్నారు. ఈ తరుణంలో శనివారం నాడు చోటు చేస్తుకున్న పరిణామం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది అనే చెప్పాలి. ఐ ప్యాక్ కు చెందిన వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లో ఒకే విమానంలో విజయవాడ వచ్చారు.

మాములుగా అయితే అది పెద్ద విషయం కాదు. కానీ ప్రశాంత్ కిషోర్ ఏ పీ 39 సిఎస్ 0393 కార్ ఎక్కి వెళ్లారు. ఇదే కార్ లో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఎక్కారు. ఈ నెంబర్ కారు టీడీపీ అధినేత చంద్రబాబు వాడుతారు అనే విషయం తెలిసిందే. ఒక వైపు అధికార వైసీపీ కి పని చేస్తున్న ఐ ప్యాక్ మరి ఇప్పుడు తెలుగు దేశం పార్టీ కి...చంద్రబాబు కు ఎలా వ్యూహలు అందిస్తుంది...అసలు ఈ కాంబినేషన్ ఏంటో అన్నది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అధికార వైసీపీని వదిలి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు టీడీపీ వైపు ఎందుకు వచ్చారు అన్నది కూడా ఆసక్తికర పరిణామమే. ఒకే సారి..ఒకే రాష్ట్రంలో ప్రత్యర్థులుగా ఉన్న రెండు పార్టీలకు ఒకరే సలహాలు ఇవ్వటం సాధ్యం అవుతుందా...అసలు దీని వెనక కథ ఏంటో తేలాలి అంటే టీడీపీ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు చూడాల్సిందే.

Next Story
Share it