Telugu Gateway
Andhra Pradesh

జగన్ సన్నిహిత కంపెనీలు..జగన్ సన్నిహిత అధికారులైతే అంతా ఈజీ!

జగన్ సన్నిహిత కంపెనీలు..జగన్ సన్నిహిత అధికారులైతే అంతా ఈజీ!
X

తెలుగు దేశం అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోడల్ మార్చారా?. అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇప్పుడు అయన పార్టీ కి ఎవరు ఎంత లాయల్ గా ఉన్నారు అనే విషయం కంటే ...రాయల్టీ అంశంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు అనే చర్చ ఆ పార్టీ నేతల్లో ఉంది. అందుకే ఇప్పుడు పార్టీ తప్ప మరొకటి ఆలోచించని వాళ్ళందరిని పక్కన పెట్టి...ఇప్పుడు వేరే లైన్ లో వెళుతున్నారు అన్నది ఎక్కువ మంది నేతల భావన. టీడీపీ లో చంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన వెన్నంటి ఉన్న వాళ్లలో ఎక్కువ మందిని ఇప్పుడు దూరం పెట్టారు. కొంత మంది అధికారుల విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు ఆయన తన తనయుడు నారా లోకేష్ లు లాంగ్ టర్మ్స్ లక్ష్యాల కంటే షార్ట్ టర్మ్ గోల్స్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది అని ఒక సీనియర్ మంత్రి అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా నారా లోకేష్ కు లైన్ క్లియర్ చేసే ఉద్దేశంతోనే అటు ప్రభుత్వంలోనూ...ఇటు పార్టీ లోనూ ఎక్కువ మంది పాత వాళ్ళను పక్కన పెట్టి ఇప్పుడు కొత్త వాళ్ళను రంగంలోకి దింపారు అని చెపుతున్నారు. ఒక వైపు ప్రభుత్వపరంగా విజన్ 2047 గురించి పదే పదే చెప్పే చంద్రబాబు మరి పార్టీ పరంగా విజన్ సంగతి ఏ మాత్రం అయినా ఆలోచిస్తున్నారా అని ఆ పార్టీ నాయకులే సందేహం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ జగన్ వస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అని చెప్పటం తప్ప...టీడీపీ అవసరాన్ని బలంగా చెప్పే ప్రయత్నం కొరవడింది అన్నది ఎక్కువ మంది నేతల అభిప్రాయం. లాయల్టీ బదులు రాయల్టీ కి ప్రాధాన్యత ఇవ్వటం అనే కారణంతోనే జగన్ తో ఎంతో సన్నిహితంగా ఉన్నారు అని...జగన్ బినామీలు అని టీడీపీ నేతలు ప్రచారం చేసిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోల్ సోలార్ వంటి కంపెనీలకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా రెడ్ కార్పెట్ వేసింది అని టీడీపీ నేతలు చెపుతున్నారు. వై ఎస్ హయాంలోనే ఒక వెలుగు వెలిగిన మేఘా ఇంజనీరింగ్ కంపెనీ పై గతంలో టీడీపీ చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. అదే కంపెనీకి చంద్రబాబు తన ఫస్ట్ టర్మ్ లోనూ..ఇపుడు రెండవ టర్మ్ లోనూ వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ లు కట్టబెడుతున్నారు.

మళ్ళీ ఎప్పుడైనా జగన్ అధికారంలోకి వచ్చినా విచారణలు...కేసులు వంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇలాంటి కంపెనీలను ముందు పెట్టి పనులు నడిపించటం ఈజీ అన్నది వీళ్ళ లెక్క అని ఒక మంత్రి వెల్లడించారు. జగన్ కు సన్నిహిత కంపెనీలుగా పేరున్న కంపెనీలకు ..జగన్ కు సన్నిహితులుగా పేరున్న అధికారులకు కీలక పదవులు అప్పగించి తాను కోరుకున్న విధంగా పనులు చేయించుకుంటే భవిష్యత్ లో కూడా తమకు..తమ ఫ్యామిలీ కి ఢోకా ఉండదు అన్నది చంద్రబాబు, నారా లోకేష్ ఆలోచనగా చెపుతున్నారు. అందుకే అధికారుల నియామకం విషయంలో కూడా ఇదే మోడల్ ను ఫాలో అవుతున్నారు అనే చర్చ టీడీపీ నేతల్లో ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు సహాయం చేసినందునే కొంత మంది అధికారులను ఇప్పుడు కీలక పదవుల్లో నియమించినట్లు బహిరంగంగానే చెపుతున్నారు అని టీడీపీ నేతలు అవాక్కు అవుతున్నారు.

Next Story
Share it