ఏలూరు బాధితులను పరామర్శించిన జగన్
అంతుచిక్కని వ్యాధితో అల్లకల్లోలం అవుతున్న ఏలూరు ఘటనపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. బాధితులకు అందుతున్న చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అస్వస్థతకు దారి తీసిన కారణాలు.. ఇప్పటివరకు చేసిన పరీక్షల వివరాలపై ఆరా తీశారు. బాధితులందరి రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బాధితుల్లో అన్ని వయసుల వారు ఉన్నారని.. ఏలూరు అర్బన్‌తో పాటు రూరల్, దెందులూరులో కూడా కేసులు గుర్తించామన్నారు.
ఇప్పటికే ఎయిమ్స్ నుంచి డాక్టర్ల బృందం వచ్చిందని.. ఐఐసీటీ, ఎన్‌ఐఎన్, ఐసీఎంఆర్ బృందాలు వస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. డిశ్చార్జ్ అయిన వారిని కూడా అబ్జర్వేషన్‌లో ఉంచాలని అధికారులకు సూచించారు. అంతకు ముందు జగన్ సీఎం అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఏలూరులో వందల సంఖ్యలో అనారోగ్యంప పాలైన విషయం తెలిసిందే.