Telugu Gateway
Andhra Pradesh

చంద్ర‌బాబుపై పేర్ని నాని ఫైర్

చంద్ర‌బాబుపై పేర్ని నాని ఫైర్
X

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడిపై మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఆయ‌న క్రిష్ణా జిల్లా ప‌రామ‌ర్శ‌ల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌ల‌పై అభ్యంత‌రం తెలిపారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పరామర్శకు వచ్చి రాజకీయాలు మాట్లాడ‌టం ఏమిట‌న్నారు. పాత లెక్కలు తేల్చుకోవడానికి వచ్చారా? పరామర్శించడానికి వచ్చారా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కరోనాను ఎదుర్కోవడంలో ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రప్రభుత్వమే ప్రశంసించిందని మంత్రి పేర్ని నాని గుర్తు చేశారు. 20 నెలల్లోనే 97శాతం హామీలను సీఎం జగన్‌ నెరవేర్చారని అన్నారు. చంద్రబాబు నీళ్లిస్తే ప్రజలు ఎందుకు ఓడించారో? చెప్పాలన్నారు. చంద్రబాబు గిరిజనులకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. బెల్ట్‌ షాపులకు ప్రాణం పోసింది చంద్రబాబు కాదా? అని అడిగారు. దొంగలకు, వెన్నుపోటుదారులకు చంద్రబాబు ఆదర్శం అని దుయ్యబట్టారు. తెలంగాణ జల అక్రమాలపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు? అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.

Next Story
Share it