Telugu Gateway
Andhra Pradesh

పవన్ కళ్యాణ్ అప్పుడేమిచేశారు?

పవన్ కళ్యాణ్  అప్పుడేమిచేశారు?
X

దివీస్ పరిశ్రమ యూనిట్ కు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పందించారు. ఈ అనుమతులు గత ప్రభుత్వ హయాంలోనే వచ్చాయని..అప్పుడు పవన్ ఏమి చేశారని మంత్రి ప్రశ్నించారు. సమస్యలు అన్నీ పరిష్కారం అయ్యే వరకూ నిర్మాణంపై ముందుకు వెళ్ళొద్దని పరిశ్రమ యాజమాన్యానికి ఆదేశించినట్లు తెలిపారు.

పవన్ కళ్యాణ్ తెలిసి మాట్లాడుతున్నారా..లేక ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారో అర్ధం కావటం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉండగా జగన్ దివీస్ యూనిట్ ను వ్యతిరేకించి..అధికారంలోకి వచ్చాక అనుమతులు ఇవ్వటంపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పాత వీడియోను కూడా జనసేన సమావేశంలో ప్రదర్శించారు.

Next Story
Share it