టార్గెట్ చిరంజీవి
టార్గెట్ చిరంజీవితాజాగా పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశంపై స్పందించారు. అజాత శత్రువు అయిన చిరంజీవి విషయంలో సజ్జల ఇష్ఠానుసారం మాట్లాడితే సహించేది లేదు అని హెచ్చరించారు. చిరంజీవి వైసీపీ కి అనుకూలంగా మాట్లాడినప్పుడు తాను కనీసం స్పందించలేదు అని..కానీ వైసీపీ నేతలు మాత్రం ఇప్పుడు చిరంజీవిపై విమర్శలు చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు అన్ని చూస్తుంటే రాబోయే రోజుల్లో సినిమా హీరోల ఇష్యూలు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారటం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో ఒక సారి చిరంజీవి ఎన్నికల్లో తన మద్దతు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు కాకుండా మరొకరికి ఎందుకు ఉంటుంది అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల విషయంలో తాను అసలు జోక్యం చేసుకోను అని..ఎటు వైపు కూడా ఉండను అని చెప్పారు. ఇప్పుడు మాత్రం చిరంజీవి టీడీపీ, జన సేన, బీజేపీ కూటమికి మద్దతుగా మాట్లాడటంతో వైసీపీ ఆగ్రహానికి కారణం అయింది.