జగన్ పై చిరంజీవి పొగడ్తల వర్షం
BY Admin22 Jun 2021 8:08 AM GMT

X
Admin22 Jun 2021 8:08 AM GMT
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీలో ఒక్క రోజే 13.72 లక్షల మందికి మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టడం అద్భుతమైన కార్యక్రమం అంటూ కొనియాడారు. స్పూర్తిదాయకమైన నాయకత్వం అందిస్తున్నారంటూ సీఎం జగన్ కు అభినందనలు తెలిపారు. ఒక్క రోజులోనే కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వైద్య సిబ్బంది చేసిన సేవలు అభినందనీయం అన్నారు. ప్రభుత్వ చర్యలు ప్రజల్లో విశ్వాసం నింపేలా ఉన్నాయంటూ ట్వీట్ చేశారు చిరంజీవి.
Next Story