Telugu Gateway
Andhra Pradesh

అన‌కాప‌ల్లిలో ఘోర ప్ర‌మాదం

అన‌కాప‌ల్లిలో ఘోర ప్ర‌మాదం
X

బ్రిడ్జి పిల్ల‌ర్ కూలి అన‌కాప‌ల్లిలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న సంద‌ర్భంగా పెద్ద శ‌బ్దాలు రావ‌టంతో ఆ ప్రాంతంలోని ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. అనకాపల్లి జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్‌ పిల్లర్ కూలింది. ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు అక్కడ ఓ కారు, ట్యాంకర్‌ ఉన్నాయి. ఈ క్రమంలో పిల్లర్‌ భాగాలు వీటి మీద పడటంతో అవి పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యాయి.

ఈ ప్రమాదం సమయంలో కారులో ఉన్న దంపతుల్దిదరు మృతి చెందారు. పలువురికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఆనందపురం నుంచి అనకాపల్లి వరకు ఈ హైవే విస్తరణ పనులు కొనసాగతున్నాయి. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ట్యాంక‌ర్ లో ఉన్న‌వారికి గాయాలు కావ‌టంతో వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే ఈ ప్ర‌మాదానికి కార‌ణాలు ఏమిటి అనేది తేలాల్సి ఉంది.

Next Story
Share it