Telugu Gateway
Andhra Pradesh

బిజెపి ఎంపీ సుజనా చౌదరిపై లుక్ ఔట్ నోటీసులు

బిజెపి ఎంపీ సుజనా చౌదరిపై లుక్ ఔట్ నోటీసులు
X

అమెరికా పర్యటనకు బయలుదేరిన బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఇమ్మిగ్రేషన్ అధికారులు షాక్ ఇచ్చారు. లుక్ ఔట్ నోటీసులు ఉన్నందున దేశం వదిలి వెళ్ళటానికి వీల్లేదని తెలిపారు. ఓ బ్యాంక్‌ కుంభకోణం కేసులో సుజనాపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీచేశారు. అమెరికాకు బయలుదేరిన సుజనాను శుక్రవారం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారు. ఈ నోటీసులపై సుజనా చౌదరి వెంటనే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనను అక్రమంగా అడ్డుకున్నారని, లుక్‌ఔట్‌ నోటీసులు రద్దు చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు.

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.322.03 కోట్ల రుణం ఎగవేతకు సంబంధించి ఆయన కేసులు ఎదుర్కొంటున్నారు. వడ్డీతో కలిపి ఈ మొత్తం 400.84 కోట్లకు చేరుకోవడంతో వేలానికి నోటీసు ఇచ్చారు. తిరిగి చెల్లించాలని ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా సుజనా చౌదరి స్పందించకపోవడంతో తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంకు సిద్ధమైంది. సుజనా చౌదరిపై 2018లోనే మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి.

Next Story
Share it