Telugu Gateway
Andhra Pradesh

లోకేష్ పాదయాత్ర పై కుట్రకు..ఆ ఛానల్ కు ప్యాకేజి వెళ్లిందా?!

లోకేష్ పాదయాత్ర పై కుట్రకు..ఆ ఛానల్ కు ప్యాకేజి వెళ్లిందా?!
X

తెలుగు దేశం ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ యువగళం పేరుతో జనవరి 27 నుంచి పాదయాత్ర చేయనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరిగాయి..రూట్ మ్యాప్ కూడా సిద్ధం అయింది. అయితే దీనికి ఇంకా ప్రభుత్వ పరంగా అనుమతులు రావాల్సి ఉంది. ఈ తరుణంలో ముఖ్యంగా సోషల్ మీడియా లో ఒక ఛానల్ ఎడిటర్ టార్గెట్ గా విస్తృత ప్రచారం జరుగుతోంది. ఆ ఛానల్ ఎడిటర్ తాజాగా ఒక కీలక నేతతో సమావేశం అయ్యారు అని..టార్గెట్ లోకేష్ పాదయాత్ర గా ప్రత్యేక బృందాలను దింపుతున్నారంటూ ప్రచారం వైరల్ చేస్తున్నారు. అంతే కాదు...ఆ ఎడిటర్ బెంగళూరు కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు...400 కోట్ల రూపాయలు ఇప్పటికే సంపాదించారు అంటూ మరో వార్తను ప్రచారంలోకి పెట్టారు. తొలుత ఎడిటర్, కీలకనేత భేటీ అంటూ ఒక వార్త..లోకేష్ పాదయాత్రపై విషప్రచారం కోసం అంటూ ఇది అంటూ స్టార్ట్ చేశారు. తర్వాత ఆ ఛానల్ ప్రతినిధి అక్రమ ఆస్తులు సంపాదించారు....లోకేష్ పాదయాత్ర పై విషప్రచారం కోసం ప్యాకేజి తీసుకున్నారు..

ప్రత్యేక టీంలను సిద్ధం చేశారు అంటూ మరో అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ రెండు వార్తలు ఇప్పుడు మీడియా వాట్సాప్ గ్రూపుల్లో తెగ తిరుగుతున్నాయి. దీనిపై వాస్తవాలు ఏంటి అని అరా తీయగా ఇది ఒక పథకం ప్రకారం ఇది ముందస్తు దాడి అని చెపుతున్నారు. లోకేష్ పాదయాత్రను టార్గెట్ చేయకుండా చాలా ముందుగానే ఇలాంటి ప్రచారాన్ని తెరపైకి తెచ్చి..రేపు ఏదైనా ప్రచారం చేసిన తాము ముందు నుంచి చెప్పినట్లే జరిగింది అని చెప్పుకోవటం కోసమే ఇది అంతా చేస్తున్నారు అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మరి రాబోయే రోజుల్లో ఇది ఇంకా ఎంత దారుణంగా మారుతుందో చూడాలి. ఖచ్చితంగా ఆ ఛానల్ అధికార పార్టీ వైపు మొగ్గుచూపుతున్నదే. అయినా ఈ తరహా దాడి చాలా ముందస్తు ప్లాన్ తో చేస్తున్నారు అని చెపుతున్నారు. నిజంగా ఎవరు అలాంటి తప్పుడు ప్రచారం చేసినా ఏ పార్టీ అయినా నేరుగా బయటకు వచ్చి చెప్పే పని చేయవచ్చు. కానీ ఒక ముందస్తు ప్లాన్ ప్రకారం వాట్సాప్ ద్వారా ఈ ప్రచారానికి తెర తీసినట్లు చెపుతున్నారు. మరి ఇది ఎంతవరకు వెళుతుందో చూడాలి.

Next Story
Share it