Telugu Gateway
Andhra Pradesh

పెద్ద ఎత్తున లబ్దిపొందేలా బినామీలతో దందా !

పెద్ద ఎత్తున లబ్దిపొందేలా బినామీలతో దందా !
X

పక్కా సమాచారం ఆధారంగానే ముందుకు!

ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు లోపల ఏమి జరుగుతుందో తెలుస్తుంది. అంతే కాదు..జరగబోయేది కూడా తెలుస్తుంది. రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులు మాత్రం దేవుడా ఈ సారి అయినా రాజధాని ప్రాజెక్ట్ పూర్తి అయ్యేలా చూడు చాలు అని దేవుళ్ళు అందరికీ మొక్కుకుని ఉంటారు. కేంద్రం రాజధానికి ఉదారంగా సాయం చేయకపోయినా గతానికి భిన్నంగా ఈ సారి మాత్రం ఉదారంగా అప్పులు ఇప్పించటానికి మాత్రం రెడీ కావటంతో అమరావతి పూర్తి కావటంపై అటు రైతులతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ప్రజల్లో కూడా ఆశలు చిగురించాయి. ఈ సారి రాజధాని అమరావతిని ఎవరూ ఆపలేరు అనే ధీమా ప్రతిఒక్కరిలో కనిపిస్తోంది. ఇంతవరకు అంతా పెర్ఫెఫెక్ట్ గా సాగిపోయింది. కానీ సడన్ గా ఆసలు రాజధాని కోసం సమీకరించిన మొత్తం కంటే అమరావతి రెండవ దశ అంటే విస్తరణ ప్రాజెక్ట్ కోసం మరో నలభై వేల ఎకరాలు పూలింగ్ ద్వారా సమీకరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఒక సాయంత్రం మీడియాకు లీకులు ఇచ్చారు. ఇది అప్పటికపుడు తీసుకున్న నిర్ణయం కాదు. ఎప్పుడు అయితే అమరావతికి అటు ప్రపంచ బ్యాంకు తో పాటు ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణ ఒప్పందాలు ఖరారు అయి పోయాయో ప్రభుత్వ పెద్దలకు కూడా స్పష్టత వచ్చేసింది.

అప్పుడే అదనపు భూమి ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. ఈ విషయం బయటకు రావటానికి చాలా ముందుగానే కీలక స్థానాల్లో ఉన్న వాళ్లకు ఈ విషయం మొత్తం తెలుసు. ఇదే అదనుగా తమ వాళ్ళను కూడా రంగంలోకి దించి బినామీ పేర్లతో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయించినట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో పవర్ ఫుల్ పవర్ బ్రోకర్ గా మారిన లింగా సారథ్యంలో ఇప్పటికే భారీ ల్యాండ్ బ్యాంకు కు స్కెచ్ వేశారు అని ఈ విషయంలో చాలా పురోగతి కూడా ఉంది అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు చెపుతున్నాయి. ఈ లింగా ల్యాండ్ బ్యాంకు లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలోని ఒక కీలక మంత్రి కి కూడా భారీ వాటా ఉంది అని..మిగిలిన మొత్తం తన అవసరాల కోసం కొనుగులుకు ఒప్పందాలు చేసుకున్నట్లు చెపుతున్నారు. వీళ్ల్లు అంతా కూడా ముఖ్యంగా ఎయిర్ పోర్ట్ వచ్చే ప్రాంతంలోనే ఫోకస్ పెట్టారు అని...సమీకరణలో కొంత భూమి పోయినా కూడా ఎక్కువ మొత్తం తమ అధీనంలో ఉండేలాగా వీళ్ళు ప్లాన్ వేసుకున్నట్లు చెపుతున్నారు. వీళ్ళు అంతా కూడా పక్కా ముందస్తు సమాచారంతో ఏ మాత్రం ముంపునకు ఆస్కారం లేని...మంచి కోర్ ఏరియాల్లో భూములు కొనుగోలు చేస్తున్నట్లు చెపుతున్నారు. ఆ పవర్ బ్రోకర్ వసూలు చేస్తున్న మొత్తాలను ఇలా కొంత భాగం రియల్ ఎస్టేట్ లోకి...మరి కొంత వివిధ రకాల ప్రాజెక్ట్ లోకి మళ్లిస్తున్నట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి.

అమరావతి రెండవ దశకు ఎంత భూమి తీసుకుంటారు అనే విషయంలో ఇప్పటికి అధికారికంగా చెప్పకపోయినా మంత్రి నారాయణ మాత్రం తీసుకోవటం పక్కా అని మాత్రం స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం దగ్గర పక్కా సమాచారం ఉన్నందున అంటే ఏ మండలం..ఏ గ్రామం లో ఎంత భూమి తీసుకుంటున్నారో అన్న లెక్కలు కూడా పక్కాగా ఉండటంతో వీళ్ళు దీనికి అనుగుణంగా కొత్త భూములు కొనుగోలు చేస్తున్నట్లు చెపుతున్నారు. ఇప్పటికే టీడీపీకి చెందిన సీనియర్ నేత ఇటీవల కొనుగోలు చేసిన భూములకు సంబంధించిన డాక్యుమెంట్ లు ఇటీవల సోషల్ మీడియా లో హల్చల్ చేశాయి. త్వరలోనే ఈ బినామీల గుట్టు కూడా రట్టు అయ్యే అవకాశం ఉంది అని చెపుతున్నారు. అమరావతిలో మొదటి సారి కూడా ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు రాగా..ఇప్పుడు కూడా అదే మోడల్ లో ముందస్తు సమాచారంతో అధికారంలో ఉన్న వాళ్ళు మరో సారి పెద్ద ఎత్తున ప్రయోజనం పొందే పనిలో ఉన్నట్లు చెపుతున్నారు.

Next Story
Share it