Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్

ఏపీలో ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్
X

ఆంధ్ర ప్రదేశ్ లో నిర్మించనున్న తొలి గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ భోగాపురం. ఈ విమానాశ్రయ ప్రాజెక్ట్ కాంట్రాక్టు ఎల్ అండ్ టి కి దక్కింది. జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ నుంచి తమకు ఈ కాంట్రాక్టు దక్కింది అని ఎల్ అండ్ టి వెల్లడించింది. దేశ, విదేశాల్లో పలు విమానాశ్రయాలు నిర్వహిస్తున్న జీఎంఆర్ కే భోగాపురం ఎయిర్ పోర్ట్ దక్కిన విషయం తెలిసిందే. నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్న ఎల్ అండ్ టి ఇంజనీరింగ్, ప్రొక్యూర్ మెంట్ అండ్ కనస్ట్రక్షన్ (ఈపీసి) విధానంలో పనులు చేపట్టనుంది. తొలి దశలో భోగాపురం ఇంటెర్నేషన్ ఎయిర్ పోర్ట్ ను 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సామర్థ్యంతో నిర్మించనున్నారు. తర్వాత ఈ సామర్ధ్యాన్ని 1.20 కోట్ల మంది ప్రయాణికులకు పెంచే అవకాశం ఉంటుంది. ఈ తొలి దశ ప్రాజెక్ట్ ను జీఎంఆర్ దగ్గర దగ్గర 4600 కోట్ల రూపాయలతో చేపట్టనుంది.

నవంబర్ ఒకటినే జీఎంఆర్ భోగాపురం విమానాశ్రయంలో భూమి పూజ చేసింది. కాంట్రాక్టు పనులు ఎల్ అండ్ టి కి అప్పగించటంతో ఇక త్వరలోనే ఈ విమానాశ్ర పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ పనులు ఎప్పుడో స్టార్ట్ కావాల్సి ఉన్న రకరకాల కారణాలతో ఇది వాయిదా పడుతూ వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఈ విమానాశ్రయం కోసం టెండర్ లు పిలవటం..దీనిపై వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కాలం పెండింగ్ పెట్టి తర్వాత ఇదే సంస్థకు టెండర్ ఓకే చేశారు. వాస్తవానికి జీఎంఆర్ కు భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రాజెక్ట్ కేటాయించడాన్ని ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ తప్పు పట్టింది. ఇది పెద్ద స్కాం అంటూ ఆరోపణలు చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సంస్థకు పనులు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Next Story
Share it