Telugu Gateway
Andhra Pradesh

ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ..స్పోర్ట్స్ సిటీ కావాల్సిందే

ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ..స్పోర్ట్స్ సిటీ కావాల్సిందే
X

అమరావతిలో గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిపాదనపై ఎన్ని విమర్శలు వస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గేలా లేదు. గురువారం నాడు రాజధాని ప్రాంతంలో పర్యటించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మాటలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అమరావతి లో కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ తో పాటు స్పోర్ట్స్ సిటీ కట్టాలని ప్రదిపాదించినట్లు ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రధాని మోడీ సభ ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత మీడియా తో మాట్లాడిన నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిర్ పోర్ట్ తో పాటు స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసం ఇంకా కొన్ని భూములు కావాలని వీటిని పూలింగ్ కింద ఇస్తే ఓకే ..లేకపోతే భూసేకరణ కింద సేకరిస్తాం అనే సంకేతాలు ఇచ్చారు. భూ సేకరణ అయితే రైతులు నష్టపోతారు కాబట్టి ప్రజా ప్రతినిధులు పూలింగ్ రూట్ లోనే వెళ్లాలని చెపుతున్నారు అని..ఇదే విషయాన్ని రైతులతో మాట్లాడమని చెప్పినట్లు నారాయణ వెల్లడించారు.

నారాయణ మాటలు చూస్తుంటే పూలింగ్ కి ఓకే అంటే ఓకే ..లేక పోతే ఈ అవసరాల కోసం భూ సేకరణకు వెనకాడం అనే సంకేతాలు ఇచ్చారు అనే చర్చ సాగుతోంది. ఇది రాబోయే రోజుల్లో అమరావతి రైతుల్లో ఆందోళన రేపటం ఖాయంగా కనిపిస్తోంది. పూలింగ్ తో పాటు ఏ మార్గంలోనూ రైతులు ఇప్పుడు ప్రభుత్వానికి అదనంగా ఎలాంటి భూమి ఇవ్వటానికి సిద్ధంగా లేరు అని అమరావతి ప్రాంతంలోని టీడీపీ ఎమ్మెల్యేలు కొంత మంది అనధికారికంగా చెపుతున్నారు. అదనపు భూసేకరణ అంశంలో ఎలాంటి వివాదాలు తలెత్తినా మొత్తం అమరావతి ప్రాజెక్ట్ పై ఈ ప్రభావం పడుతుంది అనే ఆందోళన కూడా రైతుల్లో ఉంది. మంత్రి నారాయణ గురువారం నాడు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. . ‘ అమరావతి లో పెరిగిన భూముల విలువ నిలవాలంటే..మరింత పెరగాలంటే ఇక్కడ ఎకనామిక్ యాక్టీవిటీ పెరగాలి. ఎకనామిటీ యాక్టీవిటీ పెరగాలంటే ఖచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే కొంత ల్యాండ్ కావాలి. అసలు స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే ఐటి పరిశ్రమలు..పెద్ద పెద్దవి. హైదరాబాద్ లో ఆ రోజు చంద్రబాబు వాళ్లకు ల్యాండ్ ఇస్తే వాళ్ళు పెట్టబట్టే హైదరాబాద్ ఇప్పుడు అలా ఎదిగింది. అలాగే అమరావతి కాపిటల్ సిటీ కూడా ఎదగాలంటే పెద్ద పెద్ద కంపెనీ లు..స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. వాళ్ళు రావాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లేంది రారు. వాళ్ళు అక్కడో ...ఎక్కడో దిగి రారు. అందువల్ల ఖచ్చితంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కట్టాలనే ఉద్దేశంతో ..అంతే కాకుండా హైదరాబాద్ కు ఒక వైబ్రేషన్ వచ్చింది ఆ రోజు సీఎం చంద్రబాబు నేషనల్ గేమ్స్ కండక్ట్ చేశారు.

అందుకని ఇక్కడ ఒక స్పోర్ట్స్ సిటీ కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒక స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్, ఒక ఎయిర్ పోర్ట్ రావాలంటే మరి కొంత ల్యాండ్ కావాలి. దానికి కావాల్సిన ల్యాండ్ భూసేకరణతో తీసుకోవచ్చు. భూ సేకరణ చేస్తే రైతులు నష్టపోతారు. ప్రజాప్రతినిధులు కూడా భూ సేకరణ అయితే రైతులు నష్టపోతారు. ల్యాండ్ పూలింగ్ తీసుకోండి అని చెప్పటం జరిగింది. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ లో తీసుకోవాలని నిర్ణయించాం. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నాం. వాళ్ళను కూడా ప్రజలతో మాట్లాడామన్నాం. వాళ్ళు అందరూ ల్యాండ్ అక్విజిషన్ కు వెళ్ళమంటే అలా వెళతాం. ప్రజలు అందరూ ల్యాండ్ పూలింగ్ లో తీసుకోమంటున్నారు. ఆ విధంగా వర్క్ జరుగుతుంది. ’ అంటూ నారాయణ చెప్పుకొచ్చారు.

Next Story
Share it