Telugu Gateway
Andhra Pradesh

సినిమా ఇండస్ట్రీలో పకోడీగాళ్లు

సినిమా ఇండస్ట్రీలో పకోడీగాళ్లు
X

జగన్ సర్కారుపై విమర్శలు చేసిన మెగాస్టార్ చిరంజీవిపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలో చాలా మంది పకోడీ గాళ్ళు ఉన్నారు కామెంట్ చేశారు. ప్రభుత్వాన్ని ఎలా నడపాలో..తాము ఏమి చేయాలో వాళ్ళు చెపుతారా అని ప్రశ్నించారు.చిరంజీవి సోమవారం నాడు ‘వాల్తేరు వీరయ్య’ సినిమా 200 రోజుల వేడుకలో మాట్లాడుతూ సినిమా హీరోల రెమ్యూనరేషన్స్ ప్రభుత్వానికి ఎందుకు..వాళ్ళు ప్రత్యేక హోదా, పోలవరం, రహదారులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వంటి వాటిపై ఫోకస్ పెడితే అందరూ హర్షిస్తారు అంటూ స్పందించారు.తమ ప్రభుత్వానికి ఇచ్చే ఉచిత సలహాలు సినీ పరిశ్రమలో ఉన్న పకోడిగాళ్లకి కూడా చెబితే బాగుంటుందని ఘాటుగా వ్యాఖ్యానించారు.

రాజకీయాలు మనకెందుకు.. డ్యాన్స్‌లు, ఫైట్స్, యాక్షన్ గురించి ఆలోచించండని తన పకోడిగాళ్లకు సలహాలు ఇస్తే బాగుంటుందని సూచించారు. పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకునే కొడాలి ఈ మాటలు అన్నట్లు స్పష్టం అవుతోంది. సోషల్ మీడియా లో కూడా ఈ అంశంపై రచ్చ సాగుతోంది. ఇది అధికార వైసీపీ వర్సస్ జనసేన లా మారింది. ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా బ్రో లో మంత్రి అంబటి రాంబాబు డాన్స్ స్పూఫ్ పెట్టడంతో ఇది పెద్ద రాజకీయ వివాదంగా మారింది.

Next Story
Share it