Telugu Gateway
Andhra Pradesh

కేశినేని నాని అడుగులు ఏటో

కేశినేని నాని అడుగులు ఏటో
X

విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలుగు దేశం పార్టీ కి గుడ్ బై చెప్పబోతున్నారు. ఈ సారి టికెట్ ఇచ్చే అవకాశం లేదు అని పార్టీ అధిష్టానం సంకేతాలు పంపటంతో అయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కేశినేని నాని తన నిర్ణయాలు అన్ని సోషల్ మీడియా వేదికగానే షేర్ చేస్తున్నారు. తాజాగా శనివారం నాడు కూడా ఒక పోస్ట్ పెట్టారు. తెలుగు దేశం పార్టీ కి తన అవసరం లేదు అని భావించిన తరువాత కుడా తాను ఇంకా పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నాని అందులో పేర్కొన్నారు. దీంతో త్వరలోనే ఢిల్లీ వెళ్లి స్పీకర్ ని కలసి లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి దానిని ఆమోదింప చేయించుకుని ఆ మరుక్షణం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. కేశినేని నాని ప్రధానంగా పార్టీ అధినేత చంద్రబాబుతో వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శల పాలు అయిన విషయం తెలిసిందే. చాలా కాలం పార్టీ కార్యక్రమాలకు ఆంటీ ముట్టనట్లు ఉన్న కేశినేని నాని స్కిల్ డెవలప్ మెంట్ కేసు లో చంద్రబాబు అరెస్ట్ అయి... జైలు కు వెళ్లిన తర్వాతే యాక్టీవ్ అయ్యారు. మరో వైపు అధిష్టానం నాని సోదరుడు కేశినేని చిన్ని ని ప్రోత్సహిస్తూ వచ్చింది. చిన్నికి విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న పార్టీ నాయకులు కూడా పూర్తి అండదండలు అందిస్తున్నారు.

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర జిల్లా ఆర్థిక బాధ్యతలు అన్ని కూడా చిన్నినే చూసుకున్నారు అని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ చిన్నికి దక్కే అవకాశం ఉండటంతో నాని పార్టీ నాయకులు చెప్పిన మాటలు బయటకు రాక ముందే ఆయనే సోషల్ మీడియా ద్వారా బయటపెట్టి తన లైన్ క్లియర్ చేసుకునే పనిలో పడిపోయారు అని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మొదటి రోజు పార్టీ అధినేత ఆదేశాలు పాటిస్తాను అని ప్రకటించి...గంటల వ్యవధిలోనే మళ్ళీ తనదైన శైలిలో అధిష్టానంపై ఎటాక్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు తాను కూడా బరిలో ఉంటాను అని....అది ఇండిపెండెంట్ గానా...లేక మరో రూపంలోనా అన్నది మీరే చూస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లక్ష్యం చేరుకోవాలంటే ఏదో ఒక ఫ్లైట్ ఎక్కాలి అంటూ కామెంట్ చేశారు. మూడవసారి తాను విజయవాడ ఎంపీ కావటం కూడా ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Next Story
Share it