Telugu Gateway
Andhra Pradesh

టీడీపీ, జనసేన బీజేపీ ని వదిలించుకుంటాయా..తగిలించుకుంటాయా?!

టీడీపీ, జనసేన బీజేపీ ని వదిలించుకుంటాయా..తగిలించుకుంటాయా?!
X

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఒక్క సారిగా దక్షిణాదిలోని కీలక రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం ఇక ఏ మాత్రం ఉండదు అనే చర్చ సాగుతోంది. తెలంగాణాలో బీజేపీ చురుగ్గా ఉన్నా ఎన్నికల్లో మాత్రం పెద్దగా ప్రభావం చూపించే ఛాన్స్ లేదు అనే అంచనాలు ఉన్నాయి ప్రస్తుతం. ఇది ఇలా ఉంటే కర్ణాటక ఫలితాలతో ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రధాన పార్టీలు ఎలాంటి వైఖరి తీసుకుంటాయి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ, జనసేనలు వచ్చే ఎన్నికల్లో బీజేపీ తమతో ఉంటే ఓట్ల పరంగా కంటే కేంద్రం స్థాయిలో మద్దతు దొరుకుంది అనే ఆలోచనలో ఉన్నాయి తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయి అని ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు కూడా ఒక టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధాని మోడీ పై ప్రశంసలు కురిపించారు. ఇది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే కర్ణాటక ఫలితాల తర్వాత మాత్రం టీడీపీ, జనసేనలు బీజేపీ ని వదిలించుకుంటేనే లాభం తప్ప...తగిలించుకుంటే నష్టం అనే చర్చ సాగుతోంది. బీజేపీ అధికారంలో ఉన్నా కర్ణాటకలో ప్రధాని మోడీ అందరిని పక్కన పెట్టి వన్ మ్యాన్ షో చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.అదే సమయంలో బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ప్రభుత్వానికి పూర్తి అండదండలు అందిస్తుంది అనే విమర్శలు ఉన్నాయి.

ఈ తరుణంలో ఎంతో వ్యతిరేకత ఉన్నా బీజేపీ తో జట్టుకడితే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది అని టీడీపీ నాయకులూ అభిప్రాయ పడుతున్నారు. అయితే అధిష్టానం మాత్రం ఈ విషయంలో పునరాలోచన చేయాలనీ..టీడీపీ, జనసేన కలిసి వెళ్తే చాలు...బీజేపీ వల్ల నష్టం తప్ప లాభం ఉండదు అని ఎక్కుమంది నేతలు అభిప్రాయ పడుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో సొంత పార్టీ నేతలను పోలీసులు దారుణంగా హింసిస్తున్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎలాంటి కఠిన చర్యలకు సిద్దపడటం లేదు అంటే సీఎం జగన్, బీజేపీ బంధాన్ని అర్ధం చేసుకోవచ్చు అని ఒక కీలక నేత వ్యాఖ్యానించారు. బీజేపీ తో పొత్తు ఉంటే రాజకీయంగా నష్టం జరుగుతుంది అని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లెక్కలు వేరే ఉన్నాయన్నది కొంత మంది పార్టీ నాయకుల వాదన. మరి బీజేపీ తో స్నేహం వచ్చే ఎన్నికల్లో ఎవరిని ముంచుతుందో చూడాలి. ప్రస్తుతానికి ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ, జనసేన మాత్రమే పొత్తులో ఉన్నాయి. ఇప్పడు జనసేన టీడీపీ తో కలవటానికి రెడీ అయింది. అయితే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చేయటం కోసం బీజేపీ కూడా టీడీపీ కూటమితో కలుపుకుంటామని చెపుతున్నారు అయితే దీనిపై బీజేపీ మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా స్పందించలేదు.

Next Story
Share it