Telugu Gateway
Andhra Pradesh

దోపిడీ లో అనుభవం ఉన్న వాళ్లనే వాడుకుంటున్న కిమ్ టీం!

దోపిడీ లో అనుభవం ఉన్న వాళ్లనే వాడుకుంటున్న కిమ్ టీం!
X

అందుకే మాజీ సిఎస్ టీం తో జట్టు

గత అక్రమాల్లో వాటాలు దక్కటంతో నో యాక్షన్!

కూటమి ప్రభుత్వంలో కూడా వైసీపీతో ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తో అత్యంత సన్నిహితంగా ఉన్న ఐఏఎస్ లకు పనులు అలవోకగా అయిపోతున్నాయి అంటే అర్ధం ఏంటి?. ఇద్దరూ కుమ్మక్కు అయ్యారు అనే. లేకపోతే అత్యంత కీలకమైన రెవిన్యూ శాఖలో ఆ రిటైర్డ్ సిఎస్ కోరుకున్న పనులు అన్నీ ఎలా అయిపోతాయి?. టీడీపీ నేతలకు...క్యాడర్ కు ఆ మాత్రం విషయం తెలియదా ?. మొదటి నుంచి ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న కీలక మంత్రికి ఆ రిటైర్డ్ సిఎస్ ఎంతో సన్నిహితుడు అనే పేరుంది. జగన్ హయాంలో విశాఖపట్నంలోని ఆనందపురం, పద్మనాభపురం మండలాల్లో ఆయన బినామీ పేర్లతో వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములు దక్కించుకున్నారు . రాష్ట్రంలో అధికారం మారిన వెంటనే వాటిపై విచారణ...చర్యల సంగతి వదిలేసి సదరు మాజీ సిఎస్ టీం తో కీలక మంత్రికి చెందిన కిమ్ టీం డీల్ కుదుర్చుకుంది. దీంతో వ్యవహారం అంతా గప్ చుప్ గా మారిపోయింది.

ఇందులోనే వాళ్లకు వందల కోట్ల రూపాయల మేర లాభం వచ్చినట్లు టీడీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదే బంధాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఇప్పుడూ అదే టీంతో వైజాగ్ లో ఇటీవల ప్రారంభం అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో అదనంగా భూములు సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు అధికారాన్ని అడ్డంపెట్టుకుని అడ్డగోలుగా పనులు సాగిస్తున్నట్లు చెపుతున్నారు. గతంలో కథ నడిపించిన వాళ్లకు ఇందులో మంచి అనుభవం ఉండటంతో అదే టీంతో ఇప్పుడు ఏపీ సర్కారులో కీలక మంత్రికి చెందిన కిమ్ టీం కలిసి లావాదేవీలు నిర్వహిస్తోంది అని...అందుకే రెవెన్యూ శాఖతో పాటు ఇతర శాఖల అధికారులు కూడా వాళ్లకు సహకరిస్తున్నట్లు చెపుతున్నారు. లేకపోతే గత ప్రభుత్వంలో జగన్ కు సన్నిహితంగా ఉన్న వాళ్లకు ఈ ప్రభుత్వంలో ఇంతగా అంటే వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములు నయానో..భయానో దక్కించుకునే వెసులుబాటు ఎలా వస్తుంది అని అధికారులు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కిమ్ టీం వైజాగ్ లోని భూములపై ప్రత్యేక ఫోకస్ పెట్టి పని చేసుకుంటూ పోతోంది. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో వివిధ రకాల పరిశ్రమలు వస్తుండంతో రాబోయే రోజుల్లో ఈ భూములకు విలువ ఎన్నో రేట్లు పెరగనుంది. అందుకే అంతా వ్యూహాత్మకంగా అధికారంలో ఉన్నప్పుడే అందరూ కలిసి స్కెచ్ వేసి భారీ ఎత్తున ల్యాండ్ బ్యాంకు సమీకరించుకుంటున్నారు అని చెపుతున్నారు. ఇందుకు కొంత మంది వ్యక్తులను..కొన్ని కంపెనీ లను కూడా ఉపయోగిస్తున్నారు అని ఒక ఐఏఎస్ అధికారి వెల్లడించారు. వైజాగ్ లోని దసపల్లా భూములతో పాటు మాజీ సిఎస్ భూముల డీల్స్ విషయంలోనే ఆ కీలక మంత్రికి చెందిన కిమ్ టీం వేల కోట్ల రూపాయల మేర ప్రయోజనం పొందబోతున్నట్లు టీడీపీ వర్గాలు చెపుతున్నాయి. మిగిలిన రెండున్నర సంవత్సరాల కాలంలో ఈ కిమ్ ఇంకెన్ని అరాచకాలు చేస్తుందో అన్న ఆందోళన టీడీపీ నేతల్లో వ్యక్తం అవుతోంది. ఎందుకంటే ఇవి అన్ని కూడా వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపించటం ఖాయం అనే భయం ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది. కొంత మంది మంత్రులు అయితే ఈ కిమ్ టీం అరాచకాలపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్న తాము ఎప్పుడూ ఇలా చేయలేదు అని..కానీ వీళ్ళ దోపిడీ మరీ ఎక్కువఅయిపోయింది అని ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

Next Story
Share it