వైసీపీలో ఇంకా అదే గందరగోళం!

మరో వైపు రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థలకు వుడా, తుడా, ముడా అని పేర్లు పెట్టారు అని...ఇండస్ట్రియల్ కారిడార్ల పేరులు మరింత విచిత్రంగా ఉంటాయి అంటూ మావి గన్ అంశంపై సాగుతున్న ట్రోలింగ్ ను కవర్ చేసే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. వారం రోజులుగా రాష్ట్రంలో సమస్యలు అన్నీ వదిలేసి అమరావతి హంగామా చేస్తున్నారు అని సజ్జల విమర్శించారు. మూడు ప్రాంతాల్ని పేకముక్కలతో పోల్చి అవమానిస్తున్నారు అని ఆరోపించారు. రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అమరావతి అంశంపై రాష్ట్రమంతా సంబరాలా అని ప్రశ్నించారు. అందుకే ప్రజలు చంద్రబాబు సంబరాల పిలుపును తిరస్కరించారు అని చెప్పారు. మరో వైపు మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ మీడియా తో మాట్లాడుతూ అమరావతి తమకు శాసన రాజధాని మాత్రమే అని.. తాము ఇక్కడ లక్ష పది వేల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చుచేస్తామన్నారు.
అమరావతికి తాము వ్యతిరేకం కాదు...అక్కడ జరిగే అవినీతికి వ్యతిరేకం అంటూ...అమరావతి తమ ప్రయారిటీ కాదు అని చెప్పారు. చంద్రబాబు అమరావతి పనులు జాప్యం చేస్తే తాము ఇంకో ఆలోచన చేస్తామన్నారు. బొత్స మాటలు చూస్తుంటే అమరావతి శాసన రాజధాని అని చెపుతున్నారు అంటే ఇంకా జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్లాన్ లైవ్ లో ఉంది చెప్పదలుచుకున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. జగన్ మాత్రం అధికారంలో ఉన్నప్పుడు తెర మీదకు తీసుకువచ్చిన మూడు రాజధానుల నినాదం వదిలేసి...పార్లమెంట్ లో అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ బిల్లు ఆమోదం పొందిన తర్వాత మావి గన్ ప్రతిపడిన తెరపైకి తెచ్చి తీవ్ర విమర్శలు మూటకట్టుకున్నారు.



