Telugu Gateway
Andhra Pradesh

ఇళ్ళ స్థ‌లాల అమ్మ‌కానికి వెబ్ సైట్ ప్రారంభించిన జ‌గ‌న్

ఇళ్ళ స్థ‌లాల అమ్మ‌కానికి వెబ్ సైట్ ప్రారంభించిన జ‌గ‌న్
X

మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఎలాంటి వివాదాలు లేని ఇళ్ల స్థ‌లాలు అందించాల‌నే ఉద్దేశంతో ఏపీ స‌ర్కారు కొత్త స్కీమ్ ప్రారంభించింది.'జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లు(ఎంఐజీ)'ల పేరుతో తొలి ద‌శ‌లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో స్థ‌లాలు అమ్మ‌కాల‌కు పెట్టింది. అందిన ద‌ర‌ఖాస్తుల ఆధారంగా ఆన్ లైన్ ప‌ద్ద‌తిలోనే ఫ్లాట్ల కేటాయింపు చేయ‌నున్నారు. వార్షిక ఆదాయం లక్షల‌లోపు ఉన్న‌వారే ఈ ప‌థ‌ఖం కింద ద‌ర‌ఖాస్తు చేయ‌టానికి అర్హులుగా నిర్ణ‌యించారు. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షి ప్రాజెక్టుల‌కు సంబంధించిన వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మంగ‌ళ‌వారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఇప్పటికే 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని అన్నారు. ఇప్పటికే పేదల ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయని అన్నారు. కొత్త ప‌థ‌కంతో మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేరనుందని సీఎం జగన్ తెలిపారు. 150, 200, 240 చదరపు గజాల ప్లాట్లు ఎంచుకునే అవకాశం ఉందని తెలిపారు.

త్వ‌ర‌లోనే ప్రతి నియోజకవర్గంలో జగనన్న టౌన్‌షిప్‌లు ఏర్పాటు సిద్ధం కానున్నాయని సీఎం తెలిపారు. తొలి విడతలో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరు, అనంతపురం జిల్లా ధర్మవరం, ప్రకాశం జిల్లా కందుకూరు, వైఎస్సార్‌ కడప జిల్లా రాయచోటి, నెల్లూరు జిల్లాలోని కావలి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వద్ద లేఅవుట్లు సిద్ధం చేశారు. అన్ని అనుమతులు, వసతులతో డిమాండ్‌కు అనుగుణంగా ప్లాట్లను సిద్ధం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లు, ధరలో 20 శాతం తగ్గింపు ఉంటుందని పేర్కొన్నారు. ప్లాట్ల ధరను నాలుగు వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, నాణ్యమైన మౌలిక సదుపాయాలు ఉంటాయని సీఎం చెప్పారు. వాణిజ్య సముదాయాలు, బ్యాంకులకు స్థలాల కేటాయింపు ఉంటుందని సీఎం జగన్‌ చెప్పారు.

Next Story
Share it