Telugu Gateway
Andhra Pradesh

జగన్ మార్క్ గుడ్ న్యూస్ అంటే ఇదేనా?!

జగన్ మార్క్ గుడ్ న్యూస్ అంటే ఇదేనా?!
X

మన డబ్బులు మనకు ఇస్తే అది సాయం అవుతుందా?. జాప్యం చేసి చేసి మరి ఇస్తే అది వేధింపులు అవుతాయి తప్ప...గుడ్ న్యూస్ ఎలా అవుతుంది. అసలు మీకు డబ్బులు ఇవ్వటమే గొప్ప అందుకే మీకు ఇది గుడ్ న్యూస్ అని చెపుతోంది ఆంధ్ర ప్రదేశ్ లోని జగన్ సర్కారు ఎప్పుడో ఇవ్వాల్సిన వాటిని విపరీత జాప్యం చేసి...ఇప్పుడు ఇవ్వటానికి మాట మాత్రంగా చెప్పి అదే ఉద్యోగులకు శుభవార్త అని చెపుతుంది. శుభవార్త అంటే ఏదైనా కొత్తగా ఉద్యోగుల కోసం చేసినట్లు అయితే దాన్ని శుభవార్తగా చెప్పుకోవచ్చు. కానీ బాకీ తీసుకున్న వ్యక్తి...నీ అప్పు చెల్లించాను చూసుకో నా ఆంత మంచివాడు లేడు అని చెప్పుకున్నట్లు ఉంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ తీరు అంటూ ఉద్యోగులు అవాక్కు అవుతున్నారు ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యోగులు తమకు చట్టపరంగా ...హక్కుగా రావాల్సిన వాటి కోసమే ఉద్యమాలు చేయాల్సి వస్తోంది. అందులో ఒకటో తారీకు జీతాలు కూడా ఉన్నాయి. తమ సమస్యలపై ఉద్యోగులు తాజాగా కార్యాచరణ కూడా ప్రకటించారు. దీంతో సర్కారు వరసపెట్టి సమావేశాలు నిర్వహించి హామీలు గుప్పిస్తోంది. అందులో భాగంగానే జీపీఎఫ్ పెండింగ్ బిల్స్ తో పాటు రిటైర్మెంట్ కు సంబందించిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్ కాష్ మెంట్ , మెడికల్ బిల్స్ చెల్లిస్తామని వెల్లడించింది. ఇందులో ఏదీ కూడా ఉద్యోగులకు చేస్తున్న సాయం కాదు. పైగా ఎపుడో ఇవ్వాల్సిన వాటిని ప్రభుత్వం తన అవసరాలకు వాడు కుని..ఇప్పుడు ఇస్తామని ప్రకటించటమే కాకుండా ఇదేదో శుభవార్త గా ప్రచారం చేస్తోంది.

ఉద్యోగులకు జీతాలు చెల్లించే సమయంలో కట్ చేసే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సిపీఎస్ ) నిధులను కూడా సకాలంలో జమ చేయటం లేదు ..ఐటి కింద ఉద్యోగుల దగ్గర కట్ చేసిన మొత్తాలను కూడా వాళ్లకు జమచేయక పోవటం తో ఇటీవల కాలంలో ఐటి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు లు జారీచేసింది అని ఉద్యోగులు చెపుతున్నారు. మూడు వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లిస్తామని సర్కారు తాజాగా ఉద్యోగలకు హామీ ఇచ్చింది. అయితే దీనిపై నమ్మకం లేని ఉద్యోగులు లిఖితపూర్వకంగా చెప్పాలని కోరుతున్నారు. ఇది ఇలా ఉంటే ఉద్యోగులకు బకాయిలపై హామీ ఇచ్చారు...అదే సమయంలో సర్కారు తన నవరత్నాలు సంబంధించి కొత్త చెల్లింపుల షెడ్యూలు కూడా విడుదల చేసింది. మార్చి 18 నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమాలు..ఏప్రిల్ 18 వరకు సాగనున్నాయి. ఇది చూసిన తర్వాత ఉద్యోగులకు మళ్ళీ ఈ బకాయిల కియరెన్సు పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో వాళ్లకు తెలుసు కాబట్టి. ఒక వైపు మూడు వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించి..ప్రభుత్వం తన స్కీంలు అమలు చేయటం సాధ్యం కాదు అన్నది వీళ్ళ ఆందోళన. మరి ఇప్పుడు అయినా సర్కారు మాట నిలబెట్టుకుంటుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. పెండింగ్‌ ఆర్థిక డిమాండ్లు తీర్చాలంటూ ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంగళవారం అమరావతి సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశం అయిన విషయం తెలిసిందే.


Next Story
Share it