Telugu Gateway
Andhra Pradesh

పత్రిక ఉద్యోగులకు..పార్టీ ఉద్యోగులకు సర్కారు వేతనాలు!

పత్రిక ఉద్యోగులకు..పార్టీ ఉద్యోగులకు సర్కారు వేతనాలు!
X

లెక్కలు తీస్తున్న కూటమి సర్కారు!

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గత ఐదేళ్ల కాలంలో ప్రభుత్వాన్ని ఒక ప్రవేట్ కంపెనీలా నడిపారా?. అంటే అవుననే చెపుతున్నాయి అధికార వర్గాలు. అధికారంలోకి వచ్చిన కొత్తలో తనకు 151 సీట్లు వచ్చాయి కాబట్టి ఎవరూ ఏమి మాట్లాడానికి లేదు...తాను ఏది అనుకుంటే అది జరగాలి అన్నట్లు వ్యవహరించారు జగన్ . రాష్ట్రం లో ఉన్న మొత్తానికి మొత్తం సీట్లు వచ్చిన సరే ప్రభుత్వం అంటే అమలులో ఉన్న నియమ, నిబంధనల ప్రకారమే నడవాల్సి ఉంటుంది...నడపాల్సి ఉంటుంది అనే విషయం చెప్పాల్సిన ఐఏఎస్ అధికారులు ఆ విషయం మర్చిపోయి ఆయన చెప్పిన పనులు అన్ని చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది...గత ప్రభుత్వంలో సాగిన అక్రమాలపై దృష్టి పెట్టింది. దీంతో ఇప్పుడు ఎంత మంది అధికారులు బుక్ అవుతారు..ఎన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయనే భయంతో తప్పులు చేసిన అధికారులకు చమటలు పడుతున్నాయి. గత ఐదేళ్ల కాలంలో సాక్షి ఉద్యోగులకు, వాళ్ళ కుటుంబ సభ్యలకు కూడా ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చి...భారీ ఎత్తున వేతనాలు ఇచ్చినట్లు కొత్త ప్రభుత్వం గుర్తించింది. వీళ్ళు పనేమీ చేయకపోయినా..ఆఫీస్ లకు రాకపోయినా కూడా లక్షల రూపాయల మేర ప్రభుత్వం నుంచి జీతాలు పొందినట్లు గుర్తించి..ఇప్పుడు ఆ లెక్కలు వెలికి తీసే పనిలో పడ్డారు.

గత కొన్ని రోజులుగా జగన్ పాలనపై దృష్టి పెట్టిన వాళ్లకు కళ్ళు తిరిగే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ ప్రగతి, ఆర్టీజీ విభాగాల్లో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుందని గుర్తించారు. పార్టీ కోసం పని చేసిన వాళ్లకు..జగన్ సొంత పత్రిక కు సంబదించిన వాళ్లకు కూడా ఇక్కడ ఉపాధి కలిపించినట్లు గుర్తించారు. జీతాల పేరుతో భారీగా ప్రభుత్వ ఖాజానాకు నష్టం చేకూర్చినట్టు నివేదికలు సిద్ధం అయ్యాయి. అదే సమయంలో ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తూ.. పార్టీ కోసం పని చేసిన వారి జాబితాను కూడా సిద్దం చేశారు. కొంత మందికి అయితే ఐదేళ్ల పాటు ఆఫీస్ రాకపోయినా కూడా జీతాలు చెల్లించినట్లు గుర్తించారు. పలు శాఖల్లో సాగిన అడ్డగోలు నియామకాలు.. వారి అటెండెన్స్ వివరాలతో నివేదికలు సిద్ధం చేస్తున్నారు. మొత్తం మీద అవసరం లేని వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చి..పార్టీ కోసం పని చేసిన వాళ్లకు కలుపుకుని మొత్తం వందల కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగ్యం చేసినట్లు తేల్చారు. ఈ విషయాలు అన్ని ప్రజల ముందు పెట్టి రెవెన్యూ రికవరీ చట్టం కింద ఈ మొత్తం రాబట్టాలా..లేక ఇతర మార్గాలు అనుసరిస్తారా అన్న అంశంపై పూర్తి నివేదిక సిద్ధం అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు అని చెపుతున్నారు.

Next Story
Share it