తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా జె సీ ప్రభాకర్ రెడ్డి
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అప్రతిహత విజయాన్ని దక్కించుకుంది. విచిత్రంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాత్రం జె సీ ప్రభాకర్ రెడ్డి తన సత్తా చాటారు. అయితే తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ఎవరు అవుతారు అన్న టెన్షన్ గురువారం ఉదయం వరకూ కొనసాగింది. దీనికి కారణం రెండు పార్టీల మధ్య ఓట్లు సమానంగా ఉండటమే. అయితే సీపీఐ అభ్యర్ధితోపాటు ఇండిపెండెంట్ కూడా టీడీపీకి మద్దతు ఇవ్వటంతో తాడిపత్రి మున్సిపాలిటీ టీడీపీ వశం అయింది.
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా జె సీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. దీంతో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎక్స్ అఫీషియో ఓట్ల విషయంలోనూ ఇక్కడ వివాదం నెలకొంది. చివరకు ఉత్కంఠకు తెరదించుతూ టీడీపీ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఎన్నికలు పూర్తి అయి ఫలితాలు వచ్చిన వెంటనే క్యాంపులు పెట్టి ఇరు పార్టీలు తమ అభ్యర్ధులు ఎటూ జారిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి.